లౌకిక భావజాలానికీ ముప్పు
సదస్సులో వక్తల ఆందోళన
మతోన్మాదం వల్ల పొంచివున్న ప్రమాదం
కాపాడుకోడానికి పోరాటాలు చేయాలని పిలుపు
హైదరాబాద్: భారత రాజ్యాంగం, లౌకిక భావజాలం ప్రమాదం లో పడ్డాయని, వాటి పరిరక్షణకు పోరాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వక్తలు అన్నారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా సిపిఐ రాష్ట్ర సమితి అధ్యర్యంలో బుధవారం మఖ్దూంభవన్‌లో “లౌకిక వాదాన్ని రక్షించుకుందాం, రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం” అనే అంశంపై సదస్సు జరిగిం ది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ హరగోపాల్, వక్తగా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి హాజరయ్యారు. మహాత్మాగాంధీని హతమార్చిన మతోన్మాద భావజాలం నేడు మహా రాక్షసిలా బలపడిందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. సామ్రాజ్యవాదం, మతోన్మాదం వల్ల ప్రమాదం పొంచి ఉంద ని ఆందోళన వ్యక్తం చేశారు. వీటి నుంచి దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకిక భావజాలాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. తన మతంలో విశ్వాసాన్ని ఉంచుతూనే ఇతర మతాలను గౌరవించాలనేది గాంధీ భావజాలమ ని, ఆ ఉన్నత భావజాలం రాజ్యాంగ రూపకల్పనలో ప్రతిబింబించిందన్నారు. మనది లౌకిక రా జ్యాంగమని, అలాంటిది విశ్వాసాలను విద్వేషాలుగా మార్చి మనుషుల మధ్య హింసను ప్రేరేపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగంపై మతోన్మాదులు, సామ్రాజ్యవాదులు దాడులు చేస్తున్నారని అన్నారు. సదుద్దేశ్యంతో నాడు డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించారని, దేశంలో సమ సమాజం రావాలని అన్ని రకాల అసమానతలు తొలగాలని పొందుపరిచారన్నారు. ఇవాళ వచ్చిన అవినీతి నమూనా అసమానతలను పెంచి పోషించేలా ఉందన్నారు. ఇప్పటికే వ్యవస్థలన్నింటిని విధ్వంసం చేశారని, విశ్వవిద్యాలయాలను కొల్లగొడుతున్నారని, వ్యక్తులపై, విలువలపై, రాజ్యాంగంపై గౌరవం లేకుండా పోయిందన్నా రు. మనిషి మనిషిగా జీవించాలి, మనిషి మనిషిని గౌరవించాలని, మానవ సంబంధమే లౌకిక భావజాలం అని వివరించారు. మానవ సంబంధాలను ఉదాత్తసంబంధాలుగా తీర్చిదిద్దడానికి కృషిచేయా ల్సిన అవసరం ఉందన్నారు. ఆధిపత్య రూపాలకు వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే, సెక్యులర్ భావజాలాన్ని కాపాడుకోలేమన్నారు.
ప్రమాదంలో రాజ్యాంగం
RELATED ARTICLES