సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
ప్రజాపక్షం/నాగర్‌కర్నూల్ కమ్యూనిస్టుల పోరాట ఫలితమే దేశంలో ప్రభుత్వ రంగసంస్థల ఏర్పాటు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిలా ్లకేంద్రంలో జిల్లా సిపిఐ రెండవ మహాసభలు జరిగాయి. సభలకు ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి పల్లావెంకట్‌రెడ్డి హజరయ్యారు. మహాసభలలో భాగంగా జిల్లా కేంద్రంలోని గాంధీపార్కు నుండి జెడిపిహెచ్‌ఎస్ పాఠశాల వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో పేదరికం, దరిద్రంలో ఇంకా 55 శాతంపైబడి ప్రజలు అల్లాడుతున్నారని, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అచ్చెదిన్‌గా ప్రచారం చేసుకుంటుందని… పేదల పరిస్థితి సచ్చేదిగా మారిందన్నారు. వ్యవసాయరంగంలో ఇప్పటికి 60 నుండి 70శాతం ప్రజలు ఆధారపడ్డారని.. కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతులకు వ్యతిరేకంగా నల్లచట్టాలను తీసుకవస్తే… 750 మంది రైతులు నల్లచట్టాలు వద్దని తమ ప్రాణాలను త్యాగంచేస్తే తప్ప రైతులకు క్షమాపణ చెప్పి వాటిని రద్దుచేశారని అన్నారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లావెంకట్ మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతుందని, ఇతర పార్టీలపై గెలిచిన అభ్యర్థులను సిబిఐ, ఇడిల దాడుల పేరుతో బిజెపి అనుకూలంగా మలుచుకొని 14 రాష్ట్రాలలో దొడ్డిదారిన ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందన్నారు. కేంద్రప్రభుత్వం కార్పొరేట్లకు అండగా ఉంటుందని, ఆదానీ, అంబానిలను రెండు కండ్లుగా చూసుకుంటున్నదని విమర్శించారు. గత ప్రభుత్వం హయాంలో పేదలకు పక్కా ఇండ్లు, ప్రభుత్వ సంస్థలతో సేవలు, సంక్షేమ పథకాలు అందించేవారని, ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. మునుగోడులో బిజెపి గెలిస్తే అధికారం చేపట్టవచ్చని కేంద్రమంత్రి అమిత్‌షా కలలు కంటున్నారని, అలా జరిగితే రాష్ట్రం నాశనం అవుతుందని, అందుకే టిఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చామన్నారు. అధికారపార్టీకి మద్దతు ఇచ్చినా ప్రజా సమస్యలపై పోరాటాలు ఆపేదిలేదన్నారు. నల్గొండ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులకు జాతీయహోదా తీసుకువచ్చి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని, కోనేరు రంగారావు కమీషన్ సిఫారసు అమలు చేయాలని, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకొని నిరుపేదలకు అందించాలని, ఇండ్ల నిర్మాణానికి రూ. 5లక్షలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం.బాల్‌నర్సింహ్మ మాట్లాడుతూ జిల్లాలో గల పెండింగ్ ప్రాజెక్టులను సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకువెళ్లి త్వరగా పూర్తయ్యేవిధంగా చొరవ తీసుకోవాలని రాష్ట్ర నాయకులను కోరారు. ఈ బహిరంగలో జిల్లా, మండల నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు ,కార్మిక నాయకులు పాల్గొన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు కమ్యూనిస్టుల పోరాట ఫలాలే…
RELATED ARTICLES