ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ నిర్ణయం
ప్రజాపక్షం/ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ ష్ట్రీడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు ప్రభుత్వంలో ఎపిఎస్‌ఆర్‌టిసి కార్మికుల విలీనం, కొత్త ఇసుక విధానం సహా పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆ మోదం తెలిపింది. ఆర్‌టిసి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించేందుకు అంగీకారం తెలిపింది. ప్రజా రవాణా శాఖ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని మంత్రి వర్గ నిర్ణయాలను మీడియాకు వెళ్లడించారు. విలీనంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంజనేయరెడ్డి కమిటీ ప్రధానంగా 5 రకాల ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచింది. వాటికి యథాతథంగా ఆమోదం తెలిపింది. ఆర్‌టిసి ఉద్యోగులను ప్రభు త్వ ప్రజా రవాణా విభాగంలోకి తీసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ప్రభు త్వం ఆర్డినెన్సు జారీ చేయనుంది. 15 రోజుల్లో విధివిధానా లు సిద్ధమవుతాయి. ఆర్‌టిసిలోని 52 వేల మంది ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60ఏళ్లకు పెరగనుంది. నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఆర్‌టిసిలో ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టు కార్మికులు యథాతథంగా ఆర్‌టిసి ప్రజా రవాణా శాఖలో కాంట్రాక్టు కార్మికులుగా కొనసాగుతారు. బస్సు ఛార్జీలపై స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన నియంత్రణ వ్యవస్థ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆర్‌టిసికున్న రూ.330 కోట్లు ఆర్థిక బాధ్యతను ప్రభుత్వం చేపడుతుంది.