దేశాల వారీగా జాబితాను విడుదల చేసిన గ్లోబల్ హెల్త్ అథారిటీ
బీజింగ్/వుహాన్: ‘కరోనా.. కరోనా.. కరోనా..’ ఎవరి నోట విన్నా ఇదే మాట. ఇప్పుడు ఈ వైరస్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. చైనా నుంచి పుట్టుకొచ్చిన ఈ మహమ్మారి బారిన ప్రపంచ వ్యాప్తంగా 34,800లకుపైగా మంది పడ్డారు. గ్లోబల్ హెల్త్ అథారిటీ తాజాగా కరోనా వైరస్ బాధితుల జాబితాను శనివారం విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం.. చైనాలో 722 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అదే విధంగా మరో 34,546 మందికి ఈ వైరస్ సోకింది. హాంగ్‌కాంగ్‌లో ఒకరు మృతి చెందగా, 25 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా సెంట్రల్ హుబేయ్ ప్రావిన్స్‌లో కరోనా మరణాలు సంభవించాయి. గత ఏడాది డిసెంబర్‌లో బయటపడిన కరో నా వైరస్ బారినపడిన వారి వివరాలను దేశాల వారీగా పరిశీలిస్తే…. జపాన్ – 89, సింగపూర్ 33, థాయిలాండ్ 32, దక్షిణ కొరియా 24, ఆస్ట్రేలియా జర్మనీ అమెరికా 12, తైవాన్ 16, మలేషియా వియత్నాం 13, ఫాన్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 5, కెనడా 6, యునైటెడ్ కింగ్‌డమ్ 3, భారత్ 3, ఫిలిప్పీన్స్ (ఒకరు మృతి సహా, రష్యా ఇటలీ బ్రిటన్ 3, బెల్జియం నేపాల్‌లో 1, శ్రీలంక 1, స్వీడన్ 1, స్పెయిన్ 1, కంబోడియా 1, ఫిన్లాండ్ (ఎపి)లో ఒక కేసు నమోదైంది.
చైనాలో మరో 1500 పడకల ఆసుపత్రి
ప్రాణాంతక కరోనా వైరస్‌తో డ్రాగన్ దేశం పోరాడుతోంది. దీని బారిన పడిన ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూ భయపెడుతోంది. ఈ నేపథ్యంలోనే కరోనా బాధితులకు చికిత్స చేసేందుకు వుహాన్‌లో మరో అతిపెద్ద ఆసుపత్రి అందుబాటులోకి వచ్చింది. 1500 పడకలతో లైషెన్‌షాన్ పేరుతో ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో శనివారం నుంచి రోగులను చేర్చుకుంటూ చికిత్స అందిస్తున్నారు. ఇందులో 32 వార్డులు, ఒక సర్జికల్ ఆపరేటింగ్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. వారం రోజుల క్రితం వెయ్యి పడకలతో నిర్మించిన ఆసుపత్రి అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. కేవలం తొమ్మిది రోజుల్లోనే ఈ ఆస్పత్రి నిర్మాణం జరిగింది. ఈ ఆసుపత్రిలో 419 వార్డులు ఉన్నాయి. మొత్తం 1400 మంది వైద్యులు అందుబాటులో ఉన్నారు. గత సోమవారం నుంచి ఇక్కడ రోగులకు వైద్యం అందిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితులు 34,800
RELATED ARTICLES