క్రీడా విభాగం: ప్రతిష్టాత్మకమైన ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని ప్రతి దేశం కలలు కనడం, తమ జట్టు ఎలాగైన విశ్వ విజేతగా నిలవాలని అందరూ కోరుకుంటారు. దాదాపు 10 జట్లు తీవ్రంగా పోటీ పడితే ఆఖరికి ఒక జట్టుకు మాత్రమే ట్రోఫీని దక్కించుకునే భాగ్యం లభిస్తుంది. ప్రపంచకప్ పోటీల కోసం ప్రతి జట్టు అన్ని విధాలుగా సిద్ధమవుతోంది. కానీ ఆ జట్లలో ఏ జట్టయితే అత్యుత్తమ ప్రదర్శన చేస్తుందో వారికే ప్రపంచకప్ కిరీటం దక్కుతుంది. అయితే విశ్వ విజేతగా నిలిచే జట్ల విజయం వెనుక ఆ జట్టు సారథుల పాత్రలు కీలకంగా ఉంటాయి. ఎందుకుంటే ప్రపంచకప్ లాంటి మెగా సమరంలో ప్రతి మ్యాచ్‌లో తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని జయించి, తమ ఆటగాళ్లలో ధైర్యం నింపే బాధ్యత ఫీల్డ్‌లో ఉన్న కెప్టెన్‌పైనే ఉంటుంది. ఏ సమయంలో ఎవరిని బ్యాటింగ్‌కు పంపాలి.. ఎవరితో బౌలింగ్ చేయించాలి..ఇలా చాలా విషయాల్లో కెప్టెన్ నిర్ణయం కీలకం. ఏ జట్టయిన విజయం సాధించాలంటే జట్టులోని సభ్యులందరూ కలిసికట్టుగా రాణించాలి. అప్పుడే మంచి ఫలితాలు రాబట్టవచ్చు. ఇక జట్టులోని ప్రతి సభ్యుడితో కెప్టెన్ కలిసిమెలసి ఉంటూ వారి సలహాలను వింటూ.. వారికి తగిన సూచనలు ఇస్తూ జట్టును ముందుకు సాగించాలి. అప్పుడే అనుకున్న ఫలితాలు సాధించవచ్చు.
ఎక్కువసార్లు తమ దేశానికి ప్రపంచకప్ ట్రోఫీలు అందించిన ధీరులు ఎవరో ఓసారి చూస్దాం.
క్లువ్ లాయిడ్ (1975, 1979)..
ఇక ప్రతిష్టాత్మకమైన ప్రపంచకప్ పోటీలు ఇప్పటి వరకు 11 జరిగాయి. అందులో ఆస్ట్రేలియా అందరికంటే ఎక్కువగా వరల్డ్‌కప్ ట్రోఫీని గెలుచుకుంది. తర్వాత భారత్, వెస్టిండీస్ జట్లు రెండో స్థానంలో ఉన్నాయి. అయితే వెస్టిండీస్ జట్టు తొలి రెండు సీజన్‌లలో విశ్వవిజేతగా నిలిచింది. 1975లో తొలిసారి ప్రపంచకప్ పోటీలు జరిగాయి. ఆ సమయంలో క్లువ్ సారథ్యంలోని వెండీస్ జట్టు ట్రోఫీని ఎగురవేసుకొనిపోయింది. ఆ సమయంలో కరీబియన్ జట్టు భీకరఫామ్‌లో ఉంది. ప్రపంచ అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్లతో పాటు విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌లతో కరీబియన్ జట్టు ప్రత్యర్థి జట్లను హడలెత్తించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో లాయిడ్ సారథ్యంలోని విండీస్ అద్భుతమైన విజయం తొలి విశ్వవిజేతగా రికార్డుల్లో నిలిచింది. ఆ తర్వాత (1979)లో జరిగిన రెండో ప్రపంచకప్‌లోనూ క్లువ్ లాయిడ్ సారథ్యంలోని వెస్టిండీస్ జట్టు అదే జోరును కనబర్చింది. ఎదురులేని శక్తిగా ప్రత్యర్థి జట్లపై విరుచుకుపడింది. వరుస విజయాలతో చెలరేగింది. ఈ క్రమంలోనే ఫైనల్‌కు చేరిన కరీబియన్ జట్టు మరో పటిష్టమైన ఇంగ్లాండ్ జట్టును చిత్తుగా ఓడించి రెండో ట్రోఫీని ఎగరవేసుకుపోయింది. లాయిడ్ తన అద్భుతమైన కెప్టెన్సీతో వెస్టిండీస్‌కు వరుసగా రెండో ప్రపంచకప్ అందించాడు. తర్వాత ఏ కెప్టెన్ కూడా వెస్టిండీస్‌కు ఇప్పటివరకు మరో ప్రపంచకప్‌ను అందించలేక పోవడం గమనార్హం.
రికీ పాంటింగ్ (2003, 2007)..
ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎక్కువ సార్లు విశ్వవిజేతగా నిలిచిన జట్టుగా ఆస్ట్రలియా సంచలనం సృష్టించింది. అందరికంటే ఎక్కువగా 5 సార్లు ప్రపంచకప్ ట్రోఫీలను గెలుచుకున్న ఆస్ట్రేలియా రికీ పాంటింగ్ సారథ్యంలోనే (2003, 2007)లలో వరుసగా రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. పాంటింగ్ ఆసీస్‌లో విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. తన సారథ్యంలో ఆసీస్‌ను విశ్వవిజేతతో పాటు ఐసిసి ర్యాంకింగ్స్‌లో అధిక కాలం అగ్ర స్థానంలో నిలిపాడు. ఇక ఆస్ట్రేలియా ఇతర కెప్టెన్‌లలో ఆలెన్ బొర్డర్ (1987), స్టవ్ వా (1999), మైకెల్ క్లార్క్ (2015)లలో తలోసారి తమ జట్టును విజేతగా నిలిపారు.
కపిల్ దేవ్ (1983)..
భారత్.. కపిల్ దేవ్ సారథ్యంలో 1983లో తొలిసారి విశ్వ విజేతగా నిలిచింది. అప్పటికే రెండు సార్లు ప్రపంచకప్ ట్రోఫీలను గెలిచి జోరుమీదున్న వెస్టిండీస్ జట్టుకు కపిల్ సారథ్యంలోని టీమిండియా పెద్ద షాకిచ్చింది. అప్పటి వరకు భారత్ అంటే పెద్దగా ఎవరికీ తెలియదు. అలాంటి సమయంలో కపీల్ దేవ్ అద్భుతంగా టీమిండియాను ఒకొక్క మెట్టు ఎక్కిస్తూ ముందుకు సాగిస్తూ ఫైనల్స్ వరకు చేర్చాడు. ఇక ఫైనల్లో భారత్ ప్రత్యర్థి వెస్టిండీస్. విండీస్ అంటెనే అన్ని జట్లకు వనుకు అలాంటి సమయంలో కపిల్ దేవ్ తన బృందంతో పటిష్టమైన కరీబియన్ సవాల్‌ను సమర్థంగా ఎదుర్కొన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో విండీస్‌ను కట్టడి చేసి భారత్‌కు చిరస్మరణీయ విజయంతో తొలి ప్రపంచకప్ ట్రోఫీని కపిల్ దేవ్ అందించాడు. ఈ సిరీస్‌లో కపిల్ దేవ్ ఆల్‌రౌండర్ షోతో ఆకట్టుకున్నాడు.
ధోనీ (2011)..
ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో భారత్ రెండో ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. 2011లో శ్రీలంకతో జరిగిన ఫైనల్ సమరంలో భారత జట్టు అద్భుతంగా రాణించింది. తక్కువ వ్యవధిలోనే ధోనీ భారత జట్టు పగ్గాలు అందుకునన్నాడు. ఇక ధోనీ తన కెప్టెన్సీలో భారత్‌ను మళ్లీ మునుపటి ఫామ్‌ను అందించాడు. ఒకొక్క మ్యాచ్ గెలుస్తూ ఫైనల్ వరకు తమ ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇక ఫైనల్లో శ్రీలంకపై అద్భుతమైన విజయంతో భారత్‌కు రెండో ప్రపంచకప్‌ను అందించాడు.
మరోవైపు ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలో పాకిస్థాన్ జట్టు 1992లో విశ్వవిజేతగా నిలిచింది. ఇక 1996లో అర్జున రాణతుంగా కెప్టెన్సీలో శ్రీలంక తొలి ప్రపంచకప్ ట్రోఫీని అందుకొని సంచలనం సృష్టించింది. అప్పటి వరకు అంచనాలు లేని పసికూనగా ఉన్న శ్రీలంక ఒకేసారి అద్భుతంగా చెలరేగింది. ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి కొత్త చరిత్ర సృష్టించింది.
ప్రపంచకప్ విజయవంతమైన సారథులు
RELATED ARTICLES