న్యూఢిల్లీ: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బి) హైదరాబాద్ ప్రొఫెసర్ కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ను మూడేళ్ల కోసం ప్రధాన ఆర్థిక సలహాదారుగా ప్రభు త్వం శుక్రవారం నియమించింది. ఆర్థిక మంత్రిత్వ శా ఖ నుంచి అరవింద్ సుబ్రమణ్యన్ తప్పుకున్నాక ప్రధాన ఆర్థిక సలహాదారు పదవి ఈ ఏడాది జూలై నుంచి ఖా ళీగా ఉంది. ‘హైదారాబాద్లోని ఐఎస్బి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ను ప్రధాన ఆర్థిక సలహాదారు పదవికి క్యాబినెట్ నియామక కమిటీ (ఎసిసి) ఆమోదం తెలిపింది’ అని ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది. ఆయన ఈ పదవిలో మూడేళ్లపాటు ఉందనున్నారు. ఐఐటి-ఐఐఎం పూర్వ విద్యార్థి సుబ్రమణ్యన్ అమెరికాలోని చికాగో యూనివర్శిటీకి చెందిన బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి పిహెచ్డి(ఫైనాన్షియల్ ఎకనామిక్స్) పొందారు. ప్రధాన ఆర్థిక సలహాదా రు పదవికి ప్రభుత్వం జూలైలో దరఖాస్తులను ఆహ్వానించింది. పారిశ్రామిక అభివృద్ధి, విదేశీ వాణిజ్యంకు సంబంధించిన పాలసీ ఇన్పుట్స్,పారిశ్రామిక ఉత్పత్తు ల ట్రెండ్స్ విశ్లేషణ నిర్వహించడం, కీలక ఆర్థిక సూచిక ల గణాంక సమాచారం విడుదల చేయడం అన్నది ప్ర ధాన ఆర్థిక సలహాదారు బాధ్యత. బ్యాంకింగ్, కార్పొరే ట్ గవర్నెన్స్, ఆర్థిక విధానం ప్రముఖ నిపుణుల్లో సుబ్రమణ్యన్ ఒకరని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బి) పేర్కొంది. సెబీ కార్పొరేట్ గవర్నెన్స్ , భారత రిజ ర్వు బ్యాంకు(ఆర్బిఐ) గవర్నెన్స్ ఆఫ్ బ్యాంక్స్ నిపుణు ల కమిటీల్లో ఆయన ఇదివరలో పనిచేశారు. దీనికి తోడు ఆయన ప్రత్యామ్నాయ పెట్టుబడి విధానం, ప్రైమ రీ మార్కెట్లు, సెకండరీ మార్కెట్లు, పరిశోధనల సెబీ స్థా యి సంఘంలో సభ్యులుగా ఉన్నారు. బంధన్ బ్యాంక్, ద నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్మెంట్, ఆర్బిఐ అకాడమీ బోర్డులో కూడా ఆయన సభ్యులుగా ఉన్నారు. తన అకాడమిక్ కెరీర్ను ఆరంభించడానికి ముందు జెపి మోర్గాన్ ఛేస్(న్యూయార్క్)లో ఆయన కన్సల్టెంట్గా పనిచేశారు. గతంలో ఆయన అమెరికాలో ని ఎమోరీ యూనివర్శిటీకి చెందిన గోయిజుటా బిజినెస్ స్కూల్లో ఫైనాన్స్ ఫ్యాకల్టీగా పనిచేశారు. ద ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా కూర్పును, విడుదలను ప్ర ధాన ఆర్థిక సలహాదారే నిర్వహిస్తారు. అరవింద్ సుబ్రమణ్యన్ 2014 అక్టోబర్లో ప్రధాన ఆర్థిక సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు. ఆయన కేంద్ర ఆర్థిక మం త్రి అరుణ్ జైట్లీ కోరిక మేరకు నిర్ధారిత మూడేళ్ల కాలం కన్నా ఎక్కువ రోజులే ఆ పదవిలో కొనసాగారు. ఇదివరలో రఘురామ్ రాజన్ కూడా ప్రధాన ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. తర్వాత ఆయన 2013లో ఆర్బిఐ గవర్నర్ అయ్యారు.
ప్రధాన ఆర్థిక సలహాదారుగా కృష్ణమూర్తి సుబ్రమణ్యన్
RELATED ARTICLES