వరి వద్దన్న కెసిఆర్…ఫామ్ హౌస్‌లో ఎలా వేస్తారు?
ప్రజాపక్షం/హైదరాబాద్: వరి వేసుకునే రైతులు ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్ వైఖరితోనే ఉరేసుకుంటున్నారని టిపిసిసి అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలకు వరి వేసుకోవద్దన్న కెసిఆర్, తన ఫామ్‌హౌజ్‌లో 150 ఎకరాల్లో వరిపంటను ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఎర్రవల్లిలోని కెసిఆర్ వరి పంటను సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు మీడియాకు ప్రత్యక్షంగా చూపిస్తానన్నారు. రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర చెల్లించి, కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి కెసిఆర్ ఫామ్‌హౌజ్‌లోని వరి పంటల ఫోటోలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల గోస ట్టించుకోకుండా రాజకీయ క్రీడలు ఆడుతున్నాయని ఆరోపించారు. మద్దతు ధర ప్రకటించిన పంటను కొనకపోతే ప్రభుత్వంపై పిడి యాక్ట్ నమోదు చేసి జైల్‌లో వేయాలి డిమాండ్ చేశారు. కెసిఆర్ పండించే వరి వడ్లను ఎవరు కొంటారని ప్రశ్నించారు. కేంద్రం కొనుగోలు చేసినా చేయకపోయినా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందన్నారు. మూడు నెలలుగా రైతులపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వింత వైఖరి అవలంబిస్తున్నాయన్నారు. ప్రభుత్వాలు, పాలకులు మారినప్పటికీ రైతుల తల రాత మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు క్షమాపణ చెప్పి రైతు చట్టాలు వెనక్కి తీసుకున్న మోడీ ప్రభుత్వం, మళ్ళీ చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోడీకి సిఎం కెసిఆర్ లొంగిపోయారని ఆరోపించారు. కనీస మద్దతు ధర ప్రకటించిన 23 పంటలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల దగ్గర నుండి కొనాల్సిందేనని, చట్టం కూడా ఇదే చెబుతుందన్నారు. రైతులు వరి పంట వేయాలని, ఎందుకు కొనుగోలు చేయరో తాను చూస్తానని అన్నారు. చత్తిస్‌ఘడ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం క్వింటాల్ వరిని రూ 2540లతో కొనుగోలు చేస్తుందని, యాసంగిలో చిరు ధాన్యాలు వేసేందుకు అక్కడి రైతులకు ఎకరాకు రూ 9 వేల బోనస్ అందజేస్తుందని వివరించారు. ఆ రాష్ట్రానికి మంత్రులు హరీష్ రావు, కెటిఆర్ వెళ్లి అక్కడి విధానాన్ని తెలుసుకోవాలని సూచించారు. చత్తీస్‌గడ్‌కు తానే తీసుకెళ్లి అక్కడి సిఎం,మంత్రులతో కలిపిస్తానని, వచ్చేందుకు మంత్రులు హరీశ్‌రావు, కెటిఆర్ సిద్ధమా అని సవాల్ విసిరారు. మిల్లర్లు, దళారులతో కెసిఆర్ ప్రభుత్వం కుమ్మక్కైందని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు దాసోహమైందనివిమర్శించారు.
ప్రధాని, సిఎం వైఖరితో ఉరేసుకుంటున్న రైతులు
RELATED ARTICLES