HomeNewsBreaking Newsప్రతి గ్రామానికీ ఒక కార్యదర్శి

ప్రతి గ్రామానికీ ఒక కార్యదర్శి

కొత్తగా 9355 మంది గ్రామ కార్యదర్శుల నియామకం
27న పంచాయతీరాజ్‌ అవగాహన సదస్సు
ఎంఎల్‌ఎల ద్వారా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు
అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌

ప్రజాపక్షం / హైదరాబాద్‌: రెండవసారి పదవీ బాధ్యత లు చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చకచకా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రాధాన్యతాంశాలపై సమీక్షలు నిర్వహిస్తూ, ఎన్నికల వాగ్దానాల పై సత్వర చర్యలు చేపట్టారు. ఎన్నికల సభల్లో మరోసా రి అధికారంలోకి వచ్చిన పది హేను రోజుల్లో కొత్త జిల్లా లు, మండలాలు ఏర్పాటు చేస్తామని ఆయా నియోజకవర్గాల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్తగా ములుగు, నారాయణపేట్‌ జిల్లాలు, కోరుట్ల రెవెన్యూ డివిజన్‌, గట్టుప్పల, మల్లంపల్లి, చండూరు, మోస్రా, ఇంగుర్తి, నారాయణరావుపేట మండలాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధా న కార్యదర్శిని ఆదేశించారు. దీంతో కొత్తగా రెండు జిల్లా లు, ఒక రెవెన్యూ డివిజన్‌, ఆరు కొత్త మండలాలు ఏర్పా టు కానున్నాయి. ప్రస్తుతం ఉన్న 31 జిల్లాలకు అదనంగా రెండు జిల్లాలు తోడైతే మొత్తం జిల్లాల సంఖ్య 33 కు చేరనుంది. అలాగే వచ్చే ఏప్రిల్‌ నుండి 57 ఏళ్ళు నిం డిన వారికి ఆసరా పెన్షన్‌లు ఇచ్చే విధంగా చర్యలు తీ సుకోవాలని సిఎం కెసిఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. త్వర లో పంచాయతీరాజ్‌ ఎన్నికలు రానుండడంతో గ్రామ కా ర్యదర్శుల నియామకాలకు సంబంధించిన ఫైలుపై ఆ యన సంతకం చేశారు.ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆదివారం నాడు పంచాయతీరాజ్‌ అంశాలతో పాటు, ఎన్నికల హామీలపై సమీక్ష నిర్వహించారు. ప్రభు త్వ సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, ఎంఎల్‌ఏలు సి.లక్ష్మారెడ్డి, ఎర్రబెల్లి ద యాకర్‌ రావు, వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఆరూరి రమేశ్‌, చ ల్లా ధర్మారెడ్డి, సీనియర్‌ అధికారులు ఎస్‌.నర్సింగ్‌ రావు, రాజేశ్వర్‌ తివారి, రామకృష్ణారావు, వికాస్‌ రాజ్‌, స్మితా సభర్వాల్‌, నీతూ ప్రసాద్‌, రఘునందన్‌ రావు, పౌసమి బసు తదితరులు పాల్గొన్నారు. సమావేశ వివరాలను సిఎం కార్యాలయం పత్రికా ప్రకటన ద్వారా విడుదల చేసింది.
కొత్తగా 9355 మంది గ్రామ కార్యదర్శుల నియామకం
వెంటనే గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ర్టం, దేశం అభివృద్ధి చెందుతుందని, కాబట్టి గ్రామాభివ ద్ధిపై ఎక్కు వ దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు పిలుపునిచ్చారు. రాష్ర్టంలోని ప్రతీ గ్రామ పంచాయితీకి ఒక గ్రామ కార్యదర్శిని నియమించాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా రూపొందించిన పంచాయతీరాజ్‌ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి గ్రామాల రూపురేఖలు మార్చాలని చెప్పారు. గ్రామ పంచాయతీఎన్నికల నిర్వహణ పూర్తి కాగానే, గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచే కార్యక్రమాలను ఉదృతంగా నిర్వహించాలని చెప్పారు. రాష్ర్టంలోని 12,751 గ్రామాలకు గాను, ప్రతీ గ్రామంలో ఒక గ్రామ కార్యదర్శిని నియమించడం కోసం కొత్తగా 9355 మంది గ్రామ కార్యదర్శుల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టింది. కొత్త జోనల్‌ వ్యవస్థ ద్వారా చేపట్టిన మొదటి నియామక ప్రక్రియ కూడా ఇదే. నియామక ప్రక్రియ కూడా ముగిసింది. నియామక ఉత్తర్వులు జారీ చేయాలని కలెక్టర్లను ఆదేశిస్తూ రూపొందించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కెసిఆర్‌ సంతకం చేశారు. కొత్త గ్రామ కార్యదర్శుల నియామకంతో గ్రామాలన్నింటికీ అధికారులు ఉంటారని, వీరి ద్వారా గ్రామాభివ ద్ధి, పచ్చదనం, పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
27న పంచాయతీరాజ్‌ అవగాహన సదస్సు
కొత్తగా నియామకమైన గ్రామ కార్యదర్శులు, ఇప్పటికే ఉన్న పంచాయతీకార్యదర్శులతో కలిసి మొత్తం 12,751 వేల మంది గ్రామ కార్యదర్శులు, ఎంపిడివోలు, ఇవోపిఆర్‌డిలు, డిపిఓలు, డిఎల్పీఓలతో కలిపి ఈ నెల 27న ఎల్‌.బి. స్టేడియంలో అవగాహన సదస్సు నిర్వహించాలని ఈ సమీక్షలో నిర్ణయించారు. అధికారులంతా మధ్యాహ్నం 12 గంటల వరకు ఎల్‌.బి. స్టేడి యం చేరుకుంటారు. మద్యాహ్న భోజన అనంతరం 2 గంటలకు సదస్సు ప్రారంభం అవుతుంది. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రారంభోపన్యాసం చేస్తారు. గ్రామాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేస్తారు.

ఎంఎల్‌ఏల ద్వారా కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్‌ చెక్కులు
కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్‌ చెక్కులను తిరిగి శాసనసభ్యుల ద్వారానే పంపిణీ చేయాలని సిఎం కెసిఆర్‌ ఆదేశించారు. ఎన్నికల కోడ్‌ కారణంగా కొద్ది రోజుల పాటు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించామని, ఇప్పుడు తిరిగి పాత పద్దతిలోనే ఎంఎల్‌ఏల ద్వారా పంపిణీ చేయాలని చెప్పారు.

ఏప్రిల్‌ నుండి 57 ఏళ్లు నిండితే పెన్షన్లు
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్‌ అందించనున్నట్లు సిఎం కెసిఆర్‌ చెప్పా రు. దీనికి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేయాలని, అర్హులను ఎంపిక చేయాలని సిఎస్‌ను ఆదేశించారు. లబ్ధిదారుల లెక్క తేలిన తర్వాత 2019- బడ్జెట్‌లో దీనికి సంబంధించి నిధులు కేటాయించి, ఏప్రిల్‌ మాసం నుంచి పెన్షన్లు అందివ్వాలని చెప్పారు.
కొత్త జిల్లాలు ములుగు, నారాయణపేట
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ రెవెన్యూ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్‌ తివారీని ఆదేశించారు. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించినట్లయింది. కోరుట్ల కొత్త రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని, గట్టుప్పల్‌ (మునుగోడు నియోజకవర్గం), మల్లంపల్లి (భూపాలపల్లి), చండూ రు, మోస్రా (బాన్స్‌వాడ), ఇంగుర్తి (మహబూబాబాద్‌), నారాయణరావుపేట (సిద్ధిపేట) మండలాలను ఏర్పాటు చేయాలని సిఎం ఆదేశించారు. ప్రస్తుతం జనగామ జిల్లాలో ఉన్న గుండాల మండలాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో కలపాలని సూచించారు.
19 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ
బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేయడానికి సిద్ధం చేసిన చీరలను ఈ నెల 19 నుంచి పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బతుకమ్మ పండుగ సందర్భంగానే పంచడానికి ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఫిర్యాదు వల్ల ఆగిపోయిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ప్రస్తుతం క్రిస్మస్‌ పండుగ సందర్భంగా క్రిస్టియన్లకు పంచే దుస్తులతో పాటు బతుకమ్మ చీరలను కూడా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments