HomeNewsBreaking Newsప్రతిష్టంభన!

ప్రతిష్టంభన!

రష్యా, ఉక్రేన్‌ మధ్య ముగిసిన చర్చలు
గోమెల్‌ (బెలారస్‌): రష్యా, ఉక్రేన్‌ దేశాల మధ్య సయోధ్య దిశ గా సోమవారం బెలారస్‌ సరిహద్దుల్లోని గోమెల్‌లో జరిగిన చర్చలు ఎలాంటి కీలక ఒప్పందాలు లేకుండానే ముగిశాయి. ప్రస్తుతానికి చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిందని అంటున్నారు. అయితే, ఇరు దేశాలు ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయని కారణంగా, తదుపరి చర్చలు ఉంటాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది. నాటో కూటమిలో ఉక్రేన్‌ చేరకూడదని, ఒకవేళ అదే జరిగితే తమ దేశ భద్రతకు ముప్పు పొంచి ఉంటుందని రష్యా చాలాకాలంగా స్పష్టం చేస్తున్న విషయం తెలిసిందే. నాటో కూటమిలో చేరబోవడం లేదని లిఖితపూర్వక ఒప్పందంపై సంతకం చేయాలని రష్యా కోరుతుండగా, ఉక్రేన్‌ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉక్రేన్‌పై సైనిక చర్య తప్పలేదని, తమ దేశ భద్రతే ముఖ్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటన కూడా చేశారు. సైనిక చర్య ప్రారంభమైన తర్వాత తలెత్తిన పరిణామాల నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య చర్చల ప్రక్రియ ప్రారంభం కావడం గమనార్హం. సుమారు నాలుగు గంటలు సాగిన ఈ చర్చల్లో ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. ప్రస్తుతానికి ప్రతిష్టంభన ఏర్పడినప్పటికీ, అసలు చర్చలంటూ మొదలుకావడం శాంతి స్థాపనకు మార్గాన్ని సులభం చేసిందని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. పిటిఐ ద్వారా అందిన సమాచారం మేరకు, తక్షణమే దాడులను నిలిపివేయాలని చర్చల సమయంలో రష్యాను ఉక్రేన్‌ డిమాండ్‌ చేసింది. క్రిమియా, డాన్‌బాస్‌ ప్రాంతాల నుంచి రష్యా సేలు వైదొలగాలని కూడా ఉక్రేన్‌ పట్టుబట్టింది. యూరోపియన్‌ యూనియన్‌ (ఇయు)లో సభ్యత్వం కావాలని కూడా కోరింది. నాటో కూటమిలో చేరడానికి వీల్లేదన్న రష్యా డిమాండ్‌పై ఉక్రేన్‌ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఒప్పందాలన్నీ లిఖితపూర్వకంగానే ఉండాలన్న రష్యా సూచించగా, అందుకు కూడా ఉక్రేన్‌ సానుకూలత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. మొత్తానికి ఉక్రేన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మొండివైఖరి పరిస్థితిని మరింత విషమం చేస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చాలాకాలంగా స్పష్టం చేస్తున్న విషయం తెలిసిందే. నాటో కూటమిలో చేరబోవడం లేదని లిఖితపూర్వక ఒప్పందంపై సంతకం చేయాలని రష్యా కోరుతుండగా, ఉక్రేన్‌ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉక్రేన్‌పై సైనిక చర్య తప్పలేదని, తమ దేశ భద్రతే ముఖ్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటన కూడా చేశారు. సైనిక చర్య ప్రారంభమైన తర్వాత తలెత్తిన పరిణామాల నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య చర్చల ప్రక్రియ ప్రారంభం కావడం గమనార్హం. సుమారు నాలుగు గంటలు సాగిన ఈ చర్చల్లో ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. ప్రస్తుతానికి ప్రతిష్టంభన ఏర్పడినప్పటికీ, అసలు చర్చలంటూ మొదలుకావడం శాంతి స్థాపనకు మార్గాన్ని సులభం చేసిందని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. పిటిఐ ద్వారా అందిన సమాచారం మేరకు, తక్షణమే దాడులను నిలిపివేయాలని చర్చల సమయంలో రష్యాను ఉక్రేన్‌ డిమాండ్‌ చేసింది. క్రిమియా, డాన్‌బాస్‌ ప్రాంతాల నుంచి రష్యా సేలు వైదొలగాలని కూడా ఉక్రేన్‌ పట్టుబట్టింది. యూరోపియన్‌ యూనియన్‌ (ఇయు)లో సభ్యత్వం కావాలని కూడా కోరింది. నాటో కూటమిలో చేరడానికి వీల్లేదన్న రష్యా డిమాండ్‌పై ఉక్రేన్‌ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఒప్పందాలన్నీ లిఖితపూర్వకంగానే ఉండాలన్న రష్యా సూచించగా, అందుకు కూడా ఉక్రేన్‌ సానుకూలత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. మొత్తానికి ఉక్రేన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మొండివైఖరి పరిస్థితిని మరింత విషమం చేస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments