కళ్లకు నల్లటి బ్యాండ్ కట్టుకొని, నోటిపై వేలు వేసుకొని గాంధీ విగ్రహం వద్ద నిరసన
ఢిల్లీ అల్లర్లపై పార్లమెంట్‌లో చర్చ జరపాలని, అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్
న్యూఢిల్లీ : పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉభ య సభలు ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు ఢిల్లీ అల్లర్లపై చర్చకు పట్టుబడ్డాయి. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. లోక్‌సభలో అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు ఒకరినొకరు తోసుకున్నారు. కాగా, ఢిల్లీ అల్లరపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్, తృణమూల్ కాం గ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపిలు వేర్వేరుగా ధర్నా నిర్వహించారు. మహాత్మాగాంధీ ‘మూడు కోతులు’ను అనుకరిస్తూ ఎంపిలు నోటికి నల్లటి బ్యాండ్‌ను కట్టుకొని, నోటిపై వేలు వేసుకొని నిరసన తెలిపారు. ఢిల్లీలో జరిగిన మత అల్లర్ల అం శంపై, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామాను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సహా పార్టీ ఎంపిలు నిరసనలో పాల్గొన్నారు. అదే విధంగా ఢిల్లీలో జరిగిన హింస పై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షపార్టీ నాయకులు లోక్‌సభ, రాజ్యసభలో వాయిదా తీర్మానాలు ఇచ్చారు. గాంధీ విగ్రహం వద్ద నిరస న ప్రదర్శనలో పాల్గొన్న వారిలో రాహుల్‌గాంధీతోపాటు అధిర్ రంజన్ చౌదరి, శిశి థరూర్, ఇతరు లు పాల్గొని నినాదాలు చేశారు. అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘మన భారత్ ను కాపాడుదాం’, ‘ప్రధాని సమాధానం ఇవ్వాలి’, ‘అమిత్ షా రాజీనామా చేయాలి’ అంటూ రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఒకవైపు ఢిల్లీ తగులబడుతుంటే మరో వైపు మన హోంమంత్రి అహ్మదాబాద్‌లో ఆతిథ్యమిస్తున్నాడని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు అధిర్ రంజన్ ఎద్దేవా చేశారు. ఆతిథ్యమివ్వడం మంచిదే.. కానీ, అది భారతీయుడు హత్యలకు గురైతున్నప్పుడు కాదని హితవు పలికారు. ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి అమిత్ షా హాజరైన నేపథ్యంలో రంజన్ పై విధంగా వ్యాఖ్యానించారు. ఢిల్లీలో చోటు చేసుకున్న హింసపై దర్యాప్తు జరిపించాలని, హింస జరిగిన మూడు రోజుల తరువాత ప్రధాని నోరువిప్పారని కానీ, అమిత్ షా మాత్రం ఇంత వరకు మౌనం వీడలేదని, కేవలం పరిస్థితిని పర్యవేక్షించేందుకు అజిత్ దోవల్‌ను మాత్రమే పంపారని మండిపడుతూ అల్లర్లపై కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శించారు. విలేకరులతో థరూర్ మాట్లాడుతూ ఢిల్లీలో ఏం జరిగిందో అనే దానిపై చర్చ జరపాలని కాంగ్రెస్ కోరుకుంటుందన్నారు. శాంతి భద్రతలు తన పరిధిలో ఉన్నందున కేంద్ర హోంమంత్రితో పూర్తి బాధ్యత అని, తన బాధ్యతను అమలు చేయడంలో ఆయన పూర్తిగా విఫలమైనందున తన పదవికి రాజీనామా చేయాలన్నారు. ఢిల్లీ హింసలో పోలీసులు పక్షపాత, నిర్లక్ష్యానికి పాల్పడ్డారని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపిలు కూడా వేరుగా నిరసన తెలియజేశారు. అదే విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపిలు కూడా మత అల్లర్లు, గత వారం జరిగిన హింసపై సుప్రీం హైకోర్టు జడ్జితో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఆప్ ఎంపిలు సంజయ్ సింగ్, భగవంత్ మన్న, ఎన్‌డి గుప్తా, సుశీల్ గుప్తాలు గాంధీ విగ్రహం ముందు నిరసన ప్రదర్శన చేశారు. బిజెపి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. హింసాత్మక పరిస్థితులను పరిశీలించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీనీ వేయాలని ఏర్పాటు చేయాలని సంజయ్ సింగ్ పేర్కొన్నారు. అల్లర్లు బాధ్యులు ఎవరు?, పార్లమెంట్‌లో ఎందుకు చర్చ జరపడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. కపిల్ మిశ్రాల, ప్రవేశ్ వర్మ, అనురాగ్ ఠాకూర్ వంటి బిజెపి నాయకులు విద్వేషాలను రెచ్చగెట్టే ప్రసంగాలు చేయడం వల్లే నేడు ఢిల్లీ తగులబడుతోందని విమర్శించారు.
ప్రతిపక్షాల ధర్నా
RELATED ARTICLES