భూపేన్ హజరికా, నానాజీ దేశ్‌ముఖ్‌లకూ దేశ అత్యున్నత పురస్కారాలు
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ అత్యున్నత పురస్కారాలను కేం ద్రం ప్రకటించింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు మరో ఇద్దరిని భారతరత్న పురస్కారానికి ఎంపిక చేసింది. నానాజీ దేశ్‌ముఖ్, భూపేన్ హజారికాలకు మరణానంతరం భారతరత్న పురస్కారాలు దక్కాయి. రాజకీయాల్లో, ప్రభుత్వరంగంలో అనేక విధాలుగా సేవలందించిన ప్రణబ్ ముఖర్జీకి మేధావిగా, సంక్షోభ పరిష్కర్తగా మంచి పేరుంది. 2012 నుంచి 2017 వరకు భారత రాష్ట్రపతిగా ఆయన అందించిన సేవలను కొనియాడటంతో పాటు రక్షణ మంత్రిగా, ఆర్థికమంత్రిగా రాజకీయాల్లో తనదైన ముద్రను వేసిన వ్యక్తిగా ఆయన సేవలను గుర్తించి… ‘భారతరత్న’ పురస్కారానికి ప్రణబ్‌ను కేంద్రం ఎంపి క చేసింది. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులు చేపట్టిన ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఎనలేని కీర్తినార్జించారు. అలాగే ఐదేళ్ల పాటు రాష్ట్రపతిగా సేవలందించి ఆ పదవికే వన్నె తెచ్చారు. ప్రభుత్వానికి అవసరమైన సూచనలు చేస్తూ దేశం తరఫున గళం విన్పి స్తూ తన ప్రత్యేకత నిలుపుకొన్నారు.
ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న
RELATED ARTICLES