HomeNewsBreaking Newsప్రజా సమస్యలు పట్టించుకోకుంటే పోరాటాలు తప్పవు

ప్రజా సమస్యలు పట్టించుకోకుంటే పోరాటాలు తప్పవు

కామారెడ్డి జిల్లా సిపిఐ రెండవ మహాసభలో పశ్యపద్మ
ప్రజాపక్షం/కామారెడ్డి
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని, వాటిని పరిష్కరించకుంటే పోరాటలు తప్పవని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్యపద్మ అన్నారు. పెంచిన పెట్రో ధరలను, వంటగ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలు, ఎరువుల ధరలను తగ్గించాలని ఆమె డిమాండ్‌ చేశారు. కామారెడ్డి జిల్లా సిపిఐ 2వ మహాసభలు జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో బుధవారం జరిగాయి. సభకు ముందు జెండా ఆవిష్కరించారు. సభలకు ముఖ్య అతిథిగా పశ్యపద్మ హాజరై ప్రసంగించా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలను మరింత నిరుపేదలుగా మారుస్తున్నాయని, బిజెపి ప్రభుత్వం మత ప్రచారంతో ప్రజలను విడదీస్తున్నదని మండిపడ్డారు. అంబానీ, ఆదానీలకు, కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఆమె ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర మీద, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై విమర్శలు చేసుకుంటూ పేద, మధ్యతరగతి ప్రజలు, రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. మహాసభలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎల్‌.దశరథ్‌, సహాయ కార్యదర్శి పి.బాలరాజు, రాములు, రాజశేఖర్‌, నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments