HomeNewsBreaking Newsప్రజా పోరాటాలతోనే పూర్వ వైభవం

ప్రజా పోరాటాలతోనే పూర్వ వైభవం

ప్రాతినిధ్యం కోరేది ప్రజల కోసమే సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌

“ పోరాట చరిత్ర ఖమ్మం సొంతం. ప్రతి గ్రామం ఏదో ఒక సందర్భంలో పార్టీకి దన్ను గా నిలిచింది. అనేక చారిత్రాత్మక పోరాటాలు కమ్యూనిస్టు పార్టీ విస్తృతికి కారణమయ్యాయి. ధన రాజకీయా లు, అవకాశవాదం నడుమ కమ్యూనిస్టులు బలహీనపడినా ప్రజలు వాస్తవాలను త్వరలోనే గ్రహిస్తారు. కమ్యూనిస్టు పార్టీలు తిరిగి పూర్వ వైభవాన్ని పొందటం ఖాయం. జిల్లాలో శక్తిగా ఉన్నాం. ను నిర్ణయించే శక్తి సిపిఐకి ఉంది. వామపక్ష, సభలలో ప్రాతినిధ్యం కోరేది ప్రజల కోసమే. కమ్యూ చట్టసభల్లో ఉంటే లాభం సామాన్య ప్రజలకే. ప్రజాపోరాటాలతోనే మళ్లీ బలపడ తాం అంటున్న సిపిఐ ఖమ్మం కార్యదర్శి పోటు ప్రసాద్‌తో ‘ప్రజాపక్షం’

ప్రజాపక్షం : విద్యార్థి సంఘం నుండి జిల్లా కార్యదర్శిగా ఎదిగారు కదా కుటుంబ నేపథ్యం ఏమిటి ?
పోటుప్రసాద్‌ :
సాయుధ పోరాట వారసత్వ కుటుంబం నుంచి వచ్చాం. మా కుటుంబం మొత్తం పోరాటంలో పాల్గొన్నది. మా నాయనమ్మ ఎర్రమ్మ నల్గొండ జిల్లా పార్టీలో సాయుధ పోరాట కాలంలో కీలక భూమిక పోషించింది. అనేక ఇబ్బందులు పెట్టారు. గుండు గీసి ఊరేగించారు. మా కుటుంబాన్ని అడ్డు తొలగించుకోవాలని విశ్వ ప్రయత్నం చేశారు. అయిన కమ్యూనిస్టు పార్టీలోనే ఉన్నాం. విద్యార్థి దశలో ఎఐఎస్‌ఎఫ్‌లో పని చేశాను. ఎఐటియుసిలో పనిచేసి ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను.
ప్రజాపక్షం : జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ ఏమిటి ?
పోటు ప్రసాద్‌ :
జిల్లాలోని అన్ని మండలాలు, పట్టణాలలో కమ్యూనిస్టు పార్టీ శాఖలున్నాయి.ప్రజా సంఘా లు బలంగా పనిచేస్తున్నాయి. ఐదు నియోజక వర్గాల్లో నూ నిర్ణయాత్మక స్థానంలో ఉన్నాం. గతంలో సత్తుపల్లి, మధిర మినహా మిగిలిన మూడు నియోజక వర్గాల నుం చి కమ్యూనిస్టు పార్టీ ప్రాతినిథ్యం వహించింది. పార్టీకి విస్తృతమైన క్యాడర్‌ ఉంది. విషయాన్ని అనేక సందర్భాలలో రుజువు చేశాం. ప్రత్యర్థులు సైతం కాదన లేని
ప్రజాపక్షం: ఎన్నికల్లో ఓటమితో బలహీనపడదా ?
పోటు ప్రసాద్‌ :
ధన, అవకాశవాద రాజకీయాల్లో కమ్యూనిస్టులుగా వెనుకబడిన మాట నిజం. వార్డు మెంబరుకు లక్షల్లో ఖర్చు చేస్తున్నారు.కోట్లు ఖర్చుపెట్టగలిగితేనే చట్ట సభలకు ఎన్నికయ్యే పరిస్థితిని తీసుకొచ్చా రు. ప్రజల నుంచి నాయకులు తయారు కావటం లేదు.ప్రజా నాయకులకు అవకాశం రావటం లేదు. ఓటరుప్రజా ణులకు రాజకీయాలు కొంత కాలం మాత్రమే నడుస్తాయి. ప్రజలు అనుకున్నం త అయిన నాడు ధన రాజకీయాలు చెల్లుబాటు కావు. అప్పటి వరకు ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల పరిష్కా రం కోసం కృషి చేస్తాం.
ప్రజాపక్షం : పొత్తుల కోసం పరిస్థితి…..
పోటు ప్రసాద్‌ :
శత్రువులను ఓడించే క్రమంలో సానుకూల శక్తులతో కలిసి ప్రయాణం చేస్తాం. ఆ క్రమంలోనే ఎన్నికల అవగాహన ఉంటుంది. ప్రజల కంటే పొత్తులు, సీట్లు ముఖ్యం కాదు. కమ్యూనిస్టులు చట్టసభల్లో ఉంటే అంతిమంగా ప్రజలకే మేలు జరుగుతుంది. కేంద్రం, రాష్ట్రంలో ఈ విషయం అనేక మార్లు రుజువు అయింది. అటవీ హక్కుల చట్టం, పనికి ఆహార పథకం, పోడు వల్లనే సాధ్యమయ్యాయి. పువ్వాడ నాగేశ్వరరావు, కూనంనేని సాం బశివరావు లాంటి వారు చట్టసభల్లో ఉండటం వల్లనే లక్షల కోట్ల బయ్యారం ఖనిజ సంపద కాపాడగలిగినం. ఇటువంటి ఉదాహరణలు కొకొల్లలు. ప్రజల గొంతుక వినిపించేది కమ్యూనిస్టులే. అందుకే చట్టసభలలో ప్రాతినిథ్యం కోరుతున్నాం.
ప్రజాపక్షం : కమ్యూనిస్టులకు పూర్వ వైభవం వస్తుందా ?
పోటు ప్రసాద్‌ :
తప్పకుండా… ఇందులో ఎటువంటి సందేహం లేదు. ధన, అవకాశవాద, అస్థిర రాజకీయాలకు కాలం చెల్లక తప్పదు. గమనంలో మార్పు అనివార్యం. ఆ మార్పు సానుకూల మార్పు అవుతుంది. అవినీతి, లంచగొండితనం విపరీతంగా పెరిగింది. సా మాన్యులకు చట్టాలు అందుబాటులో లేవు. కొందరి గుప్పెట్లో చట్టాలు బందీగా మారి వారు చెప్పిందే చట్టం అవుతుంది. దీనిపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. అసంతృప్తి నుంచి ఆవేదన… ఆవేదన నుంచి ఆవేశం రాక మానదు. అప్పుడు రాజకీయాల తీరు మారుతుంది. ఇప్పటికే పాలకుల తీరుతో కమ్యూనిస్టుల అవసరం పెరుగుతుంది. మున్ముందు కమ్యూనిస్టులు మరింత బలపడతారు. ఇదే సమయంలో నిరంతరం ప్రజల పక్షాన ప్రజా పోరాటాలు నడుపుతాం. పూర్వ వైభవం తథ్యం. గిరిప్రసాద్‌, రజబ్‌ అలీ లాంటి అనేక మంది అమరుల త్యాగాలున్నాయి. ప్రతి గ్రామానికి కమ్యూనిస్టు పార్టీ నేపథ్యం ఉంది. వేల కుటుంబాలు త్యాగాలతో ఖమ్మంజిల్లా కమ్యూనిస్టు పార్టీ నిర్మితమైంది. ఆ త్యాగాలను స్మరిస్తూ ముందుకు సాగుతున్నాం.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments