సిపిఐ, టిడిపి, టిజెఎస్ సంఘీభావం
హైదరాబాద్ : పన్నెండు మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలను టిఆర్‌ఎస్‌ఎల్‌పిలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క శనివారం ఆమరణదీక్ష చేపట్టారు. “ప్రజాస్వామ్య పరిరక్షణ” పేరుతో భట్టి చేపట్టిన 36 గంటల దీక్షను ఆకస్మాత్తుగా ఆమరణ దీక్షగా పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టిజెఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. కోదండరామ్, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డిలు దీక్ష శిబిరాన్ని సందర్శించి భట్టి విక్రమార్కకు మద్దతు ప్రకటించారు. అంతకుముందు భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ రామచంద్ర కుంటియా పూలమాల వేసి దీక్షను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రె స్ పార్టీ శ్రేణులు, మాజీ మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు దీక్ష శిబిరానికి వచ్చి భట్టికి సంఘీభావం తెలిపారు. సిఎల్‌పి మాజీ నేత కె.జానారెడ్డి, ఎంఎల్‌ఎలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క, తూర్పు జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి), ఎంఎల్‌సి జీవన్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య తదితరలున్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు భట్టి ఆమరణ దీక్ష
RELATED ARTICLES