కొత్తగూడెం ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు
కొత్తగూడెం మున్సిపాలిటీలో రూ.4.95కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ప్రజాపక్షం/లక్ష్మీదేవిపల్లి ప్రజలు అవసరాలు అనుగుణంగా అభివృద్ధి పను లు చేపడుతున్నామని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అఆన్నరు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డులో రూ. 4.95కోట్ల డిఎంఎఫ్, 14వ ఆర్థిక సంఘం, పట్టణ ప్రగతినిధులతో చేపట్టిన సిసి రోడ్లు, డ్రైనేజీలు, బస్సు షెల్టర్, పార్క్, టెన్నిస్ కోర్ట్, కల్వర్టులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ జిల్లా కేంద్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసుకునే లక్ష్యంతో దశలవారీగా నిధులు మంజూరి చేయించుకొని అభివృద్ధి చేపడుతున్నామన్నారు. త్వరలో మిగిలిపోయిన పనులకు నిధుల మంజూరుకు కృషి చేస్తామన్నారు. పట్టణ ప్రజల దాహర్తి తీర్చేందుకు శాశ్వత పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తున్నట్లు తెలిపారు. త్వర లో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. అర్హులైన పేదలకు పాత కొత్తగూడెంలో ఇంటి స్థలాలు కేటాయించడం జరిగిందని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పూర్తికి కృషి చేస్తానన్నారు. జిల్లా కేంద్రం ఆదర్శంగా ఉండేలా ప్రత్యేక దృష్టి సారించి అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. వార్డు కౌన్సిలర్లు తమ ప్రాంత సమస్యలను తన దృష్టికి తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపాల్ మాజీ వైస్ చైర్మన్, సిపిఐ జిల్లా కార్యదర్శి షేక్ సాబీర్‌పాషా, తహశీల్దార్ పుల్లయ్య, మున్సిపాల్ కమీనర్ శేషంజన్ స్వామి, మున్సిపాల్ చైర్‌పర్సన్ కాపు సీతామాలక్ష్మి, వార్డు కౌన్సిలర్లు కంచర్ల జమలయ్య, అనిల్, స్థానిక నాయకులు సలిగంటి శ్రీనివాస్, ఫహీం, జహీర్, అజీజ్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, వివిధ వార్డుల ప్రజలు పాల్గొన్నారు.
ప్రజావసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు
RELATED ARTICLES