HomeNewsTelanganaప్రజాప్రయోజనాల కోసమే..

ప్రజాప్రయోజనాల కోసమే..

కేంద్రంతో సయోధ్యతో ముందుకు వెళతాం
భేషజాలకు తావులేదు
కాంగ్రెస్‌ దూరదృష్టి నిర్ణయాల వల్లే హైదరాబాద్‌ నగరం అభివృద్ధి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి
రాజీవ్‌ రహదారిపై ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి శంకుస్థాపన
ప్రజాపక్షం/మేడ్చల్‌/ హైదరాబాద్‌ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా భేషజాలకు వెళ్లకుండా కేంద్రంతో సయోధ్యతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొని వెళ్లటమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌ ఆల్వాల్‌లోని టిమ్స్‌ సమీపంలో రాజీవ్‌ రహదారిపై ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి ఆయన గురువారం శుంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ తదితరులు హాజరయ్యారు. 11 కిలో మీటర్ల పొడవు, 6 లేన్లతో రానున్న ఈ భారీ ఎలివేటెడ్‌ కారిడార్‌ను రూ.2,232 కోట్ల వ్యయం తో నిర్మించనున్నట్లు సిఎం తెలిపారు. హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు కాంగ్రెస్‌ పాలనలోనే వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేస్తూ… కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని వేళలా దూర దృష్టి నిర్ణయాల వల్లే భాగ్యనగరం అనేక రంగాల్లో వృద్ధి చెందిందన్నారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని, దీనిలో భాగంగానే రెండో దశలో 75 కి.మీ. మెట్రో విస్తరణ చేపడుతున్నామన్నారు. గత ప్రభుత్వం ప్రజల అవసరాలను పక్కన పెట్టి కేవలం తమ కుటుంబ ఆస్తులను పెంచుకోవటంలో కనపరచిన శ్రద్ధ ప్రజాభివృద్ది పనులపై లేక పోవటం వల్ల ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ అనంతరం పదేళ్లలో వెనుకబడి పోవటమే కాకుండా ఖజానా దివాళా తీసిందని విమర్శించారు. గత పాలనలో పబ్చులు, గం జాయి, డ్రగ్స్‌మయంగా రాష్ట్రం తయారయిందన్నారు. కేంద్రంతో కెసిఆర్‌ పాలకుల గిల్లికజ్జాలతో ప్రజా ప్రయోజనాలను దెబ్బ తీశారని సిఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికలప్పుడే రాజకీయాలుండాలే తప్ప పరిపాలనా సమయంలో కాదని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పథంలోకి తీసుకొని వెళ్లటమే లక్ష్యంగా ముందుకు వెళుతామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంతో మాట్లాడి సమస్యల పరిష్కారాలకు మార్గాన్ని సుగమం చేశామన్నారు. దీనిలోని భాగంగానే రాజీవ్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాధాన్యతను కేంద్రానికి వివరించి పనుల ప్రారంభించగలిగే దశకు చేరుకున్నామన్నామన్నారు. మేడ్చల్‌ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణా అభివృద్ది చెందాలంటూ రాజీవ్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ పూర్తవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకే కేంద్ర ప్రభుత్వం ఈ పనుల నిమిత్తం రక్షణ శాఖ భూములను అప్పగించిందన్నారు. ఎలివేటేడ్‌ కారిడార్‌ పూర్తయితే మేడ్చల్‌ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఎలివేటేడ్‌ కారిడార్‌ ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ముఖద్వారంలాంటిదని, మేడ్చల్‌, కుత్బుల్లాపూర్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ ప్రయాణం సులభతరం అవుతుందని వివరించారు. హైదరాబాద్‌ అభివృద్ది కోసం బిఆర్‌ఎస్‌ ధర్నాచౌక్‌లో ధర్నా చేస్తే ప్రజలు హర్షిస్తారని, దీనికి తమ పార్టీ సైతం పూర్తిగా సహకరిస్తుందన్నారు.
పోరాటమంటే ట్విట్టర్‌లో పోస్టులా..?
తమ పోరాటం ఫలించిందని కెటిఆర్‌ చెబుతున్నారని, ఏం పోరాటం చేశారని, ట్విట్టర్‌లో పోస్టులు పెట్టుడా అని సిఎం రేవంత్‌ రెడ్డి నిలదీశారు. తాము అనుమతులు తీసుకొస్తే, ఆయన(కెటిఆర్‌) పోరాటం అని చెప్పుకుంటున్నారన్నారని ఎద్దేవా చేశారు. తమ పోరాటం ఫలించిందని చెబుతున్న కెటిఆర్‌ హైదరాబాద్‌ నగర అభివృద్ధికి ఇందిరా పార్కు వద్ద ఆమరణ దీక్ష చేపట్టాలని, ‘కెటిఆర్‌ చచ్చుడో& అభివృద్ధికి నిధులు వచ్చుడో” తేలే వరకు దీక్ష చేపట్టాలని రేవంత్‌ సూచించారు. ఈ దీక్షకు తమ కార్యకర్తలే కంచెలు వేసి కెటిఆర్‌ను కాపాడుతారని రేవంత్‌ తెలిపారు.

 

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments