నేడే ఐదు రాష్ట్రాలఅసెంబ్లీ ఫలితాలు వెల్లడి
ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలు
2019 లోక్‌సభ ఎన్నికలకు ఇవి సెమీ-ఫైనల్స్
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం(నేడు) ఉదయం 8 గంటల నుంచి జరగనున్నది. ఈ ఎన్నికలు 2019 లోక్‌సభ ఎన్నికలకు సెమీ-ఫైనాల్స్‌గా చాలా మంది భావిస్తున్నందున సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఫలితాలు ఎలా ఉండనున్నాయన్న ఆదుర్ద చాలా మంది రాజకీయవేత్తలో నెలకొని ఉంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడ్డ 8,500 అభ్యర్థుల భవిత 1.74 లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లలో(ఇవిఎంలలో) నిక్షిప్తమై ఉంది. అది మంగళవారం తెరుచుకోబోతున్నది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణ రాష్ట్రాలలోని 670 స్ట్రాంగ్ రూమ్‌లలో ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను భద్రపరిచారు. ఐదు రాష్ట్రాల్లో మొత్తం 1,74,724 ఇవిఎంలు ఉపయోగించారు. అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 65,367 మెషిన్లను ఉపయోగించారు. మధ్యప్రదేశ్ నుంచి 2,907 మంది అ భ్యర్థులు పోటీపడ్డారు. పోలింగ్ జరిగాక ఇవిఎంలను స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచారు. ప్రతి అసెంబ్లీ సీటుకు ఒక స్ట్రాంగ్ రూమ్‌ను కేటాయించినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. కాగా రిజర్వులో ఉంచిన ఇవిఎంలు, సమస్యలు తలెత్తిన ఇవిఎంలను వేరుగా ఉంచారు. ఐదు రాష్ట్రాలలో 679 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఓ అభ్యర్థి మరణంతో రాజస్థాన్‌లోని ఒక సీటుకు ఎన్నికలు రద్దు చేశారు. అభ్యర్థులు లేక వారి ప్రతినిధుల సమక్షంలో మంగళవారం స్ట్రాంగ్ రూమ్‌లను తెరుస్తారు. తర్వాత అక్కడి నుంచి మెషిన్ల ను లెక్కింపు కేంద్రాలకు తీసుకెళతారు. ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫ తాలు 2019లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల సరళిని నిర్ణయించొచ్చని భావిస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ఈ అసెంబ్లీ ఎన్నిక లు బిజెపికి కీలకం కానున్నాయి. ఎందుకంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్,ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉంది. కాగా మిజోరంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ముందస్తుగానే అసెంబ్లీని ర ద్దు చేసి ఎన్నికలు ని ర్వహించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బిజె పి నాల్గోసారి అధికారంలో కి రాడానికి ప్రయత్నిస్తుండగా, రాజస్థాన్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. ఈ మూడు రాష్ట్రాలు 2014లో బిజెపి సార్వత్రిక ఎన్నికల్లో గెలవడానికి కీలకమయ్యాయి. ఈ మూడు రాష్ట్రాల్లో నాడు బిజెపి 65 లోక్‌సభ సీట్లకు 63 సీట్లను గెలుచుకుంది. ఈ సారి ఐదు రా ష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్‌కు కూడా కీలకమే. ఈ రాష్ట్రాల్లో బిజెపిని బలంగా ఎ దుర్కొంటోంది. అంతేకాక ఈశాన్య రాష్ట్రాల్లోని తన చివరి స్థావరాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తోం ది. ఈశాన్యంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఒకే ఒ క రాష్ట్రం మిజోరం. ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలకు మొ త్తంగా 25 లోక్‌సభ స్థానాలున్నాయి. కాం గ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ ఉందన్న ఎగ్జిట్ పోల్‌ను బిజెపి కొట్టిపారేస్తోంది. తుది ఫలితాల కోసం వేచి ఉన్నామంది. రాష్ట్ర అసెం బ్లీ ఎన్నికల సరళిని వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల సరళితో ముడిపెట్టొదన్ని కూడా పేర్కొంది. తెలంగాణలో ఎఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసి తాత్కాలిక సిఎం కలుసుకుని తమ మద్దతును తెలిపారు. బిజెపి సైతం టిఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తానని సూచించింది. కాగా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ఫ్రంట్ కెసిఆర్‌ను అధికారం నుంచి దింపేస్తామన్న ధీమాను చాటింది. తదుపరి ప్రభుత్వం తమదేనంటోంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే తమ కూటమిని సింగిల్ పార్టీగా పరిగణించాలని ప్రజాఫ్రంట్ గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు విన్నవించుకుంది. తెలంగాణ ఎగ్జిట్‌పోల్స్ టిఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి మధ్య చీలిపోయి ఉంది. ఫలితాలు వెలువడడానికి ముందే కాంగ్రెస అధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘ఐదు అసెంబ్లీలకు ప్రజలు ఫలితాల రూపంలో స్పష్టమైన సందేశాన్ని ఇస్తారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని అధికారం నుంచి దింపేస్తారు’ అన్నారు.