మర్కజ్ ఎఫెక్ట్‌తో భారీగా పెరుగుతున్న కేసులు
ప్రజలు ఆందోళన చెందకుండా సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్న అధికారులు!
హైదరాబాద్ : కరోనా మహమ్మారీ రాష్ట్రంపై విజృంభిస్తోంది. దీంతో ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. విదేశాల నుంచి వ చ్చిన వారికంటే ఎక్కువగా ఢిల్లీలో మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారికి పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలుతుండటంతో అటు ప్రభుత్వం ఇటు ప్రజలు ఆం దోళన చేందుతున్నారు. బుధవారం ఒక్క రోజే 30 పాజిటివ్ కేసులు, ముగ్గురు కరోనా బారిన ప డి మృత్యువాత పడ్డారంటేనే రాష్ట్రంలో ప్రస్తుత ప రిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ప్రజలు భయాందోళనలు చెందకుండా ఉండేందుకు అధికారులు సమాచారాన్ని గోప్యం గా ఉంచుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే బుధవారం అర్ధరాత్రి సమయంలో కరోనా కేసుల సంబంధించి వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా లో వచ్చే అనధికారిక సమాచారం వల్ల ప్రజలు ఆందోళన చెందకుండా ఉండేందుకు కరోనాపై ప్రత్యేక బులిటెన్‌ను విడుదల చేస్తామని వైద్యారోగ్యశాఖ గతంలో పేర్కొన్నది. ఇందుకుగానూ ప్ర తి రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో కరోనాపై రోజుకు మూ డు సార్లు బులిటెన్‌ను విడుదల చేస్తామని తెలిపింది. ప్రారంభంలో రెండు మూడు రోజులు ఎ ప్పటికప్పుడు బులిటెన్‌లను విడుదల చేసినప్పటికినీ మధ్యలో రెండు రోజులు అసలు బులిటెన్‌ల ను విడుదల చేయలేదు. కరోనాపై తాజా పరిస్థితిని తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మీడియాను, న్యూస్ పేపర్లను ఫాలో అవుతున్నా రు. రాజకీయ నాయకులు, ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో మళ్లీ బులిటెన్‌లను వైద్యారోగ్యశాఖ విడుదల చేసి మమ…అని పించుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈనెల 1వ తేదీ బు ధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మొదట విడుదల చేసిన మీడియా బులిటెన్‌లో కొత్తగా 12 పాజిటివ్ కేసులు, ఒకరు మాత్రమే మరణించిన ట్లు ప్రకటించింది. తిరిగీ బుధవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు 30, ముగ్గురు మరణించినట్లు తెలిపింది. ఒక్క రోజులోనే 30 కేసులు, మూడు మరణాలు సంభవించాయంటే ప్రజలు ఆందోళన చెందే అవకాశం ఉంటుందనే వైద్యారోగ్యశాఖ కరోనాపై సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్న ట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే గురువారం సాయంత్రం వరకు మొత్తం 127 కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే, 9 మంది మరణించారు. 14 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ప్రజల్లో కరోనా ఆందోళన
RELATED ARTICLES