నల్లమలలో యురేనియం విధ్వంసం
ప్రజలను మేల్కొలిపి ఐక్య పోరాటం
రాష్ట్ర ప్రభుత్వ వైఖరేమిటో చెప్పాలి
రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు
హైదరాబాద్ : మానవ మనుగడకే ప్రమాదం వాటిల్లే యురేనియం ప్రాజెక్టును అడ్డుకోవాల్సిందేనని ఇందుకోసం సమరం సాగిద్దామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్ని వర్గాల ప్రజలకు పిలపునిచ్చారు. నల్లమలలో యురేనియం తవ్వకాల వల్ల మానవ మనుగడకే ప్రమాదం పొంది ఉందన్నారు. తెలంగాన గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం మఖ్దూంభవన్‌లోని రాజ్‌బహదూర్ గౌర్ హాలులో “యురేనియం ప్రాజెక్టు మాకొద్దు – పచ్చటి అడవే ముద్దు” అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్యనాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ యురేనియం వెలికితీత వల్ల జరిగే నష్టాలు, విస్పోటాలను వీడియోల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను జాగృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పాలకులు ప్రజల గురిం చి, ప్రకృతి గురించి ఆలోచించకుండా కార్పోరేట్ సంస్థలకు అమ్ముడుపోతూ ఇలాంటి ప్రమాదకరమైన ప్రాజెక్టులకు అనుమతిస్తున్నాయని దుయ్యబట్టారు. మానవాళి మనుగడకు ప్రమాదకారి అయిన యురేనియం వెలికితీతను అడ్డుకోడానికి ప్రజలను చైతన్య పరుచడం ద్వారా ఉద్యరూపంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. యురేనియం వెలికితీకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరేమిటో ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేయాలని చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇలాంటి ప్రయత్నాలు జరిగితే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయన్నా రు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలన్నారు. ఈ రౌండ్‌టేబుల్ ద్వారా ముఖ్యమంత్రికి లేఖ రాయాలని సూచించారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ కావాలో, విధ్వంసక తెలంగాణ కావాలో ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పాలన్నారు. యురేనియం వల్ల ప్రత్యక్ష ప్రభావం జరిగే ప్రాంతాల్లో ఇలాంటి సమావేశాలు పెట్టాలని అక్కడి ప్రజలకు దీని వల్ల నష్టం తెలియజేయడంతో పాటు వారికి అండగా మేమున్నాం అనే భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో కమ్యూనిస్టులు పోరాటాలు చేసి అడ్డుకున్నాయని ఇప్పుడు కూడా పోరాటాలకుసిద్దంగా ఉన్నాయన్నారు. ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు కూడా తమ పోరాటాలకు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఐఐసిటి రిటైర్డ్ శాస్త్రవేత్త బాబురావు మాట్లాడుతూ యురేనియం మానవాళికి ఎంత ప్రమాదకరమో ఉదహరణలతో చెప్పారు. నల్లమలలో యురేనియం వెలికితీకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. యురేనియం వెలికితీతకు సంబంధించి గతంలో జరిగిన ప్రయత్నాలు వామపక్షాల ఆధ్వర్యంలో తిప్పికొట్టిన విషయాన్ని గుర్తు చేశారు. గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ నాయక్ మాట్లాడుతూ నల్లమల అటవీ ప్రాం తంలో యురేనియం వెలికితీత నిర్ణయం అలజడి సృష్టించిందన్నారు. దీని వల్ల అక్కడి జన జీవనం నాశనం అయ్యే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అటవి రూపు రేఖలు మారుతాయని, పర్యావరణంతో పాటు నీటి కాలుష్యం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదవ షెడ్యూల్డ్ లోని ఏజెన్సీ ఏరియా నేడు పాలకవర్గం పెంటుబడిదారుల చేతుల్లో పెట్టి మానవాళిని, అడవులను ధ్వంసం చేసే స్థితికి తీసుకెళ్ళిందన్నారు. యురేనియం తవ్వకాలను బహుళజాతి సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తులుపులు తెరిచిందన్నారు. యురేనియం వల్ల రేడియో ధార్మిక పధార్థాలు కొన్ని వేల సంవత్సరాలు వాతావరణంలో ఉండి పోతాయన్నారు. ఎంఎల్‌సి రాము లు నాయక్ మాట్లాడుతూ యురేనియం వెలికితీతను ప్రజా పోరాటాల ద్వారా నే అడ్డుకోగలమని అన్నారు. అన్ని సంఘాలు, పార్టీలను కలుపుకొని కమ్యూనిస్టులు ఉద్యమించాల్సిన అవసరం ఉందని, ఇలాంటి సమావేశాలు యురేనియం ప్రభావిత ప్రాంతాల్లో నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సమాఖ్య రాష్ట్రనాయకులు రామ్మూర్తి నాయక్, ఆర్.శంకర్ నాయక్, బోడ వీరన్న, ఎంసిపిఐ నాయకులు ఉపేందర్ రెడ్డి, రిటైర్డు ఐఆర్‌ఎస్ లక్ష్మణ్ నాయక్, మాజీ శాసన సభ్యులు గుండ మల్లేష్, రమేష్ రెడ్డి (తెలంగాణ జనసమితి), సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటి సభ్యులు శ్రీరామ్ నాయక్, న్యూడెమోక్రసి నాయకులు అనుమేష్, కాంగ్రెస్ ఎస్‌టి సెల్ నాయకులు జగన్‌లాల్ నాయక్, ఎల్‌హెచ్‌ఫిఎస్ మంగిలాల్ నాయక్, లాల్, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ధర్మానాయక్, హైకోర్టు న్యాయవాది బొమ్మగాని ప్రభాకర్, ఎంకె రత్నం, నల్గొండ జిల్లా సిపిఐ కార్యదర్శి పల్లా నర్సింహారెడ్డి, మేడ్చేల్ జిల్లా కార్యదర్శి ఐలయ్య, బిసి పోరాట సమితి నాయకులు పాండురంగా చారి, ప్రజానాట్యమండలి నాయకులు పల్లె నర్సింహా, గణేష్, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రకృతితో, ప్రజల మనుగడతో కేంద్రం చెలగాటం
RELATED ARTICLES