HomeOpinionArticlesప్రకంపనలు సృష్టిస్తున్న ‘మీ టూ’

ప్రకంపనలు సృష్టిస్తున్న ‘మీ టూ’

“మీటూ”(నేను కూడా). ఇదొక సాహసోపేత మహిళా చైతన్య ఉద్యమం. వేదిక సోషల్ మీడియా. తమ వృత్తి జీవితంలో లైంగిక వేధింపులకు గురైన ఉన్నత తరగతి మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి తమకు జరిగిన అవమానాలను వెల్లడిస్తూ, అటువంటి దౌర్జన్యపరుల పేర్లు బహిర్గతం చేస్తు న్నారు. పితృస్వామిక సమాజంలో అణిగి మణిగి ఉండటం, అవమానాలను భరించడమే నేర్చుకున్న స్త్రీలు నోరు విప్పటమనేది ఒక గుణాత్మక మార్పు. సమాజ పరివర్తనా దశకు సంకేతం. మహిళా ఉద్య మాలు, ప్రగతిశీల శక్తుల తోడ్పాటు ఫలితంగా స్త్రీకి చట్టరీత్యా అనేక హక్కులు లభించి నప్పటికీ లైంగిక హింసలు తప్పడం లేదు. నోరు విప్పితే పరువుకు, ప్రాణానికీ ముప్పు. పురుషాధిక్య సమాజం బాధితు రాలైన స్త్రీనే దోషిగా నిందిస్తుంది. ఇటువంటి సామా జిక వ్యవస్థనుంచి ఉద్భవించిన మహిళల్లో కొంద రైనా తమపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని వేలెత్తి చూపటం విప్లవాత్మకం. అయితే ఇది ఏమి సాధిస్తుంది అనే సంశయాత్మకత మెండుగా ఉంది. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టాలకు పదును తెస్తుంది. యాజమాన్యాలు, ఉద్యోగులను అప్రమత్తం చేస్తుంది. అన్నిటికీ మించి తోటి ఉద్యోగి అయిన స్త్రీపట్ల పురుషుల దృష్టిలో మార్పు తెస్తుంది. స్త్రీ పట్ల అసభ్యంగా ప్రవర్తించేందుకు, ఆమె అంగీకారం లేకుండా ఆమె శరీరాన్ని తాకేందుకు పురుషులు భయపడేలా చేస్తుంది.
హాలీవుడ్ ప్రారంభమైన ‘మీ టూ’ ఉద్యమం భారత్ వ్యాపించింది. వివిధ రంగాలకు ముఖ్యం గా మీడియా, సినీమా, ఐటి కంపెనీలకు చెందిన ఉన్నతోద్యోగులపై, ప్రముఖులపై గత మూడు వారాలుగా వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు భారత్ కుదిపివేశాయి. శరీరాన్ని తాకటం, వేధించటం, మానభంగం వంటి ఆరోపణలు వాటి లో ఉన్నాయి. 2017 అక్టోబర్ సుప్రసిద్ధ హాలీ వుడ్ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు హార్వీ వీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆరంభమై ‘మీటూ’ అనేక దేశాలకు విస్తరించి ఈ నెలలో మనదేశంలో ప్రవేశించింది. నిజానికి, 2017అక్టోబర్ రయా సర్కార్ అనే న్యాయశాస్త్ర విద్యార్థి అధ్యాపక రంగం లోని లైంగిక వేధింపుదారుల జాబితా తయారు చేసింది. దేశంలోని అధ్యాపక ప్రముఖులు దీపేశ్ చక్రవర్తి, లారెన్స్ లియాంగ్, సదానందమీనన్ వగైరా పేర్లు అందులో ఉన్నాయి. ఏవో కొద్ది కేసు ల్లో మినహా ఫిర్యాదుదారులు అధికారికంగా ఫిర్యాదు దాఖలు చేయటానికి ముందుకు రానందున ఆ జాబితావల్ల ఏమీ జరగలేదు.
అయితే హిందీ సినిమా నటి తనూశ్రీ 2008లో ఒక ఫిలిం షూటింగ్ సమయంలో ప్రసిద్ధ నటుడు నానా పటేకర్, చిత్ర నిర్మాత తనపై లైంగిక వేధింపు లకు ఒడిగట్టినట్లు ఆరోపించటంతో ప్రస్తుత రౌండ్ ‘మీటూ’ మొదలైంది. వరదగేట్లు తెరుచుకున్నట్లు వివిధ రంగాలకు చెందిన అనేకమంది స్త్రీలు తమ యజమానులు, సహచరులు లేదా తక్షణ ఉన్నతాధి కారులు తమపై గావించిన లైంగిక వేధింపుల చిట్టా విప్పారు. ఆరోపణలకు గురైనవారిలో ప్రముఖ పాత్రికేయుడు, ప్రస్తుతం కేంద్రమంత్రి ఎం.జె. అక్బర్, జర్నలిస్టులు గౌతం అధికారి, కె.ఆర్. శ్రీనివాస్, ప్రశాంత్ ఝా, మయాంక్ జైన్, సినీ డైరెక్టర్లు సాజిద్ ఖాన్, సుభాష్ ఘాయ్, వికాస్ బెహల్, రజత్ కైలాస్ ఉన్నారు.
నటుడు అలోక్ రచయిత్రి వినితానందా మానభంగం ఆరోపణ చేయగా, సంధ్యామ్రిదుల్ వంటి నటీమణులు లైంగిక దుర్వర్తన ఆరోపణలు చేశారు. ఎంజె.అక్బర్ 19-20 మంది మహిళా జర్నలిస్టులు ఆరోపణలు చేయటం గమనార్హం. అవి ఆయన పత్రికా సంపాదకునిగా పనిచేసిన కాలానికి 20-15 ఏళ్ల క్రితానికి సంబంధించినవి. విదేశీ పర్యటనలో ఉన్న ఈ విదేశాంగ సహాయ మంత్రి స్వదేశం తిరిగిరాగానే రాజీనామా చేస్తాడనో లేక మోడీ ప్రభుత్వం అతడిచేత వెంటనే రాజీనామా చేయించి ‘మీటూ’ ఉద్యమానికి సంఘీభావంగా నిలుస్తుందనో భావించినవారికి ఆశాభంగం కలి గింది. ఆరోపణలను ‘హాస్యాస్పదంగా’, ‘దురుద్దేశ పూరితం’గా కొట్టివేసిన అక్బర్ తనపై తొలుత ఆరోపణ చేసిన జర్నలిస్టు ప్రియా రమణి పై పరువు నష్టం దావా వేశారు. ఎన్నికల ముందు ఆరోపణలు చేయటంలో వారి ఉద్దేశాన్ని ప్రశ్నించి దీనివెనుక ఏదో కుట్ర ఉందంటూ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. అయితే కొద్దిరోజుల తదుపరి అక్బర్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. పిఎంఒ నుంచి లేక బిజెపి నాయకత్వం నుంచి ఒత్తిడి కారణమై ఉండవచ్చు. కాగా వ్యక్తిగత హోదాలో పరువునష్టం కేసు కొనసాగించటానికే అక్బర్ నిర్ణయించు కున్నారు. కాగా దావా ఉపసంహరించు కోవాల్సిం దిగా ‘ఎడిటర్స్ గిల్డ్’ తాజాగా సలహా ఇచ్చింది. ఇదిలావుండగా, మీడియాలోని కొందరు ప్రముఖు లపై ఆరోపణలు సానుకూల ఫలితమిచ్చాయి. హిందూస్థాన్ టైమ్స్ పొలిటికల్ ఎడిటర్ ప్రశాంత్ ఝా, టైమ్స్ ఆఫ్ ఇండియా (హైదరాబాద్) ఎడిటర్ కె.ఆర్.శ్రీనివాస్ రాజీనామా చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా మరో పూర్వ ఎడిటర్ గౌతం అధికారి సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రస్ ఫెలో పదవికి రాజీనామా చేయటంతోపాటు టైమ్స్ ఆఫ్ ఇండియాకు కాలం రాయటాన్ని నిలుపు చేస్తున్నట్లు ప్రకటించారు.
పరువునష్టం కేసులతో ‘మీటూ’ ఉద్యమాన్ని భయపెట్టి నీరుగార్చే ప్రయత్నాలతోపాటు, రెండో వైపున కొందరు సమాంతర ఉద్యమం నడుపు తున్నారు. ‘బాధితులు’ గోరంత విషయాలను కొండంత చేస్తున్నారని, అవి ‘లైంగిక వేధింపుల’ కిందకు రావని ప్రచారం చేస్తున్నారు. ఫిలిం పరిశ్రమలోని కొందరు తనూశ్రీ దత్తాను బహిష్క రిస్తున్నామని బెదిరిస్తూ అటువంటి ఇతర బాధితుల నోరునొక్కే ప్రయత్నం చేస్తున్నారు.
పనిప్రదేశాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసిసి) ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశా న్ని యాజమాన్యాలు లేదా ప్రభుత్వం సీరియస్ తీసుకోకపోవటం కూడా లైంగిక వేధింపులు కొనసాగటానికి కారణమనవచ్చు. విశాఖ x స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసులో (1997) సుప్రీంకోర్టు తీర్పులో పని ప్రదేశాల్లో లైంగిక వేధింపు తొలిసారి గుర్తించబడింది. పనిప్రదేశంలో లైంగిక వేధింపు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 19(1),21 కింద హామీ ఇచ్చిన సమానత్వం, వివక్షారహితం, వృత్తిస్వేచ్ఛ, మహిళల మర్యాద అనే ప్రాథమిక హక్కులకు ఉల్లంఘనగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అటుతర్వాత 2013 లో, 10మందికిపైగా పనిచేసే అన్ని సంస్థల్లో ఐసిసిల ఏర్పాటును ఆదేశి స్తూ తెచ్చిన ఎస్ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. అదే సంవత్సరం కేంద్రప్రభుత్వం ఐపిసిలో సెక్షన్ 354ఎను చేర్చి పని ప్రదేశాల్లో గాని, వెలుపలగాని లైంగిక వేధింపులకు పాల్పడే వారికి 1 నుండి 3సంవత్సరాలు జైలుశిక్ష, జరి మానాను ప్రవేశపెట్టింది. అయితే చట్టం అమలు చాలామేరకు కాగితాలకే పరిమితమైంది బాధిత స్త్రీలు ఫిర్యాదు చేయకపోవటానికి తమ పైవారిపై ఫిర్యాదు చేస్తే ఉద్యోగం ఊడుతుందనో లేక ప్రమోషన్ రాదనో భయాలు ఒక కారణమైతే బయటకు తెలిస్తే పరువు పోతుందన్న భయం మరో కారణమనవచ్చు.
ప్రస్తుత ‘మీటూ’ ఫిర్యాదుల విషయానికొస్తే ఆ ఘటనలు చాలా సంవత్సరాలనాటివి. నేరారోపణ లను ఆధారాలతో నిరూపించే అవకాశం ఉండదు. అదే నేరస్థులైన మగవాళ్ల ధైర్యం కూడా. అయితే చట్టరీత్యా కాకపోయినా నైతికంగా వారు నేరస్థులు గా సభ్యసమాజం ముందు తలదించుకోక తప్పదు. లైంగిక వేధింపుల పర్వంలో మరో పార్శం అసంఘటితరంగంలో మహిళలపై జరిగే అత్యాచారాలు. వారు నోరు విప్పే ధైర్యం ఇంకా రాలేదు. కాని ఎప్పుడోకప్పుడు ‘మీటూ’ ఉద్యమం వారినీ తాకుతుంది. నగరాలనుండి పట్టణాలకు, పాక్షిక పట్టణ ప్రాంతాలకు వ్యాపించక తప్పదు. సమాజం ఎప్పుడూ ఒకేలా జీవించటానికి ఇష్టపడ దనటానికి ‘మీటూ’ ప్రకంపనలే సాక్షం. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 4(2015-16) ప్రకారం, ఈ సర్వేకు ముందు సంవత్సరంలో 4.4 లక్షలమంది కౌమారదశలోని బాలికలు లైంగిక హింసకు బాధితులు. వారిలో 35 శాతంమంది ఎవరి సహాయం కోరలేదు, ఎవరికీ చెప్పుకోలేదు. 0.1 శాతం మంది మాత్రమే పోలీసుకు ఫిర్యాదు చేశారు.  వివాహేతర లైంగిక హింస మహిళలు, బాలికల్లో ఈ సర్వే సూచించిన దానికన్నా సర్వ వ్యాప్త ఆందోళనగా ఉందని పేర్కొన్నది. సమాజం మారుతున్నది. అన్ని విషయాలతో పాటు లింగసమానత్వం రాకతప్పదు. అయితే పురుషుల ఆలోచనా రీతిలో మార్పు రావాలి. మహిళల సాధికారీకరణ గూర్చి చెప్పే మాటల స్థానంలోకి చర్యలు రావాలి. ‘మీటూ’ ఉద్యమం ఆరంభం మాత్రమే.

-ఎం.ఎస్.రావు

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments