HomeNewsLatest Newsపౌరసత్వ హక్కును రద్దు చేస్తా : ట్రంప్

పౌరసత్వ హక్కును రద్దు చేస్తా : ట్రంప్

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ వలసదారుల కోసం అమలు చేసే విధానాలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించారు. అమెరికా పౌరులు కానివారికి, అనధికారిక వలసదారులకు జన్మించిన బిడ్డలకు జన్మతః పౌరసత్వం పొందేందుకు రాజ్యాంగం కల్పిస్తున్న హక్కును రద్దు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. మధ్యంతర ఎన్నికలకు ముందు వలసదారుల నియంత్రణకు పటిష్ట విధానాలను అమలు చేయడం వల్ల తనకు మద్దతు పెరుగుతుందని ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ట్రంప్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇమ్మిగ్రేషన్ దృష్టి సారించాలనుకుంటున్నట్లు తెలిపారు. దీనివల్ల తన మద్దతుదారులు బలోపేతమవుతారని, కాంగ్రెస్ నియంత్రణలో ఉంచడానికి రిపబ్లికన్లకు అవకాశం వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగాన్ని సవరించి, జన్మతః లభించే పౌరసత్వ హక్కును రద్దు చేసినట్లయితే, చాలామంది న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అమెరికాలో జన్మించినవారికి పౌరసత్వం లభిస్తుంది. దీనిపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసి, రద్దు చేస్తే, న్యాయ పోరాటం తప్పదు కదా అన్న ప్రశ్నపై ట్రంప్ స్పందిస్తూ వైట్ హౌస్ న్యాయవాదులు ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నారని తెలిపారు. ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఈ పని కానిచ్చేయవచ్చునని న్యాయవాదులు చెప్తున్నారని తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments