యూరప్, బ్రెజిల్‌పై ప్రయాణ ఆంక్షలు రద్దు
వాషింగ్టన్: మరికొద్ది గంటల్లో అధికారపీఠాన్ని, అధికార నివాసాన్ని వదిలి వెళ్ళిపోతూ కూడా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన చేష్టలు మానుకోలేదు. పోతూ పోతూ ఆయన కరోనా చిచ్చు పెట్టి పోతున్నారు. యూరప్, బ్రెజిల్ దేశాలపై విధించిన అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలను తొలగిస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కరోనా సెంకడ్ వేవ్ ఉధృతంగా విస్తరిస్తున్న తరుణంలో ఎందుకు ఇలాంటి నిర్ణయాలుతీసుకుంటున్నారంటూ అధికారం చేపట్టేందుకు సిద్ధపడుతున్న జో బైడెన్ యంత్రాంగం మండిపడుతోంది. ఇలాంటి నిర్ణయాలకు ఇది సరైన తరుణం కాదు, పరిస్థితిని ఈ నిర్ణయాలు మరింత దగజారుస్తాయి అని బైడెన్ యంత్రాంగం సోమవారంనాడు పేర్కొంది. ఓ వైపు కరోనా ఉధృతంగా ఉంటే ఎందుకిలా? ఇది సరైన సమయం కాదు అని కాబోయే వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి ట్వీట్ చేశారు. యూరోపియన్ యూనియన్, యునైటెడ్ కింగ్డమ్, ఐర్లాండ్, బ్రెజిల్ దేశాలకు ఈ ప్రయాణ ఆంక్షల ఎత్తివేత వర్తిస్తుందని ట్రంప్ తన ఉత్తర్వులలో పేర్కొనారు. అయితే బైడెన్ యంత్రాంగం మాత్రం, తాము వచ్చిన తర్వాత చాలా కఠనమైన ప్రయాణ అంక్షలు అమలు చేస్తామని ఇప్పుడే ప్రకటిస్తోంది. అమెరికా ప్రజల ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచడం మా లక్ష్యం , అందుకోసం ఇంటర్నేషనల్ ట్రావెల్ బ్యాన్ అమలు చేస్తాం అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు సాకి.
పోతూ పోతూ కూడా ట్రంప్ కరోనా చిచ్చు!
RELATED ARTICLES