తక్షణమే జలవిధానం ప్రకటించాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి
చాడ వెంకటరెడ్డి డిమాండ్
ప్రజాపక్షం / హైదరాబాద్ : శ్రీశైలం ప్రాజెక్టు నుండి రాయలసీమకు నీటిని తరలించేందుకు పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు పిలవడంపై తెలంగాణ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. కృష్ణా జలాల ఆధారంగానే తెలంగాణ రాష్ర్ట ప్రభు త్వం పాలమూరు ప్రాజెక్టును చేపట్టిందని, పనులు కూడా నడుస్తున్నాయని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో గుర్తు చేశారు. గతంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రాజెక్టులపై చర్చలు కూడా జరిపారని, ప్రాజెక్టులకు సంబంధించి సిఎం కెసిఆర్ అసెంబ్లీలో కొత్త ప్రతిపాదనల గురించి చూచాయగా ప్రకటించారన్నారు. తాజాగా పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతున్న నేపథ్యంలో కృష్ణా జలాలపైన ఆంధ్రప్రదేశ్‌తో ఎలాంటి ఒప్పందాలు జరిగాయో తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. తెలంగాణ ఉద్య మం ప్రధానంగా నీళ్ల ఎజెండాతో ప్రారంభమైందని, తెలంగాణ ప్రభుత్వం జల విధానా న్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
మెడికల్ పిజి కోర్స్ ఫీజు పెంపును ఉపసంహరించుకోవాలి ఒకవైపు కరోనాతో రాష్ట్రంలో పలువుకు సరైన వైద్యం అందడం లేదని, ఈ సమయంలో రాష్ర్ట ప్రభుత్వం పిజి మెడిసిన్ కోర్సు ఫీజు లు రెట్టింపు చేసి రూ.7లక్షల కు పెంచి పెను భారం మోపిందన్నారు. దీంతో పేదలకు మెడిసిన్ చదువులు చదువుకునే అవకాశం లేకుం డా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మూలంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన ఈ పరిస్థితుల్లో పెంచిన ఫీజులను వెంట నే తగ్గించాలని డిమాండ్ చేశారు. కరోనా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి అనేక దేశాలను గడగడలాడిస్తున్నా, క్యూబా, వియత్నం వంటి చిన్న దేశాలలో తట్టుకొని కట్టడి చేశాయని, ఇందుకు పటిష్టమైన ప్రజారోగ్య వ్యవస్థే కారణమన్నారు. కేరళలో సైతం ఇదే విధానాన్ని అమలు చేస్తుండడంతో కరోనా విస్తృతిని అడ్డుకోగలిగారు. కరోనా సమయంలో ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో వైద్యం ఉంచకపోవడం వలన అనేక మంది గుండెపోటుతో, ఇతర జబ్బులతో, మహిళలు రోడ్లపైనే ప్రసవించడం హృదయ విదారకమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలని, కాబట్టి మెడికల్ ఫీజులను తగ్గించాలని కోరారు.
పోతిరెడ్డిపాడుపై ఎపి టెండర్‌పై ప్రభుత్వ వైఖరేంటి?
RELATED ARTICLES