ఆగస్టు 9వ తేదీలోపు హక్కు పత్రాలు ఇవ్వకపోతే ప్రత్యక్ష పోరాటాలు
పోడు ప్రాంతాల్లో బంద్ నిర్వహిస్తాం
పోడు రైతు పోరాట కమిటీ హెచ్చరిక
ప్రజాపక్షం / హైదరాబాద్ ప్రపంచ ఆదివాసి దినోత్సవం నిర్వహించే ఆగస్టు 9వ తేదీలోపు రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వకపోతే ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని, పోడు ప్రాంతాల్లో బంద్ నిర్వహిస్తామని పోడు రైతు పోరాట కమిటీ హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వం జూలై 15న నిర్వహించే ‘ రెవెన్యూ సదస్సు’ల్లో పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ లోపు సమస్య గురించి ప్రభుత్వం దృష్టికి మరోసారి తీసుకుపోవాలని, అందులో భాగంగా జూలై 12న గవర్నర్, పోడు భూములపై వేసిన మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ సత్యవతి రాథోడ్, రెవెన్యూ, అటవీ శాఖ మంత్రులకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ అధ్యక్షతన పోడు రైతు పోరాట కమిటీ రాష్ర్ట కమిటీ సమావేశం గురువారం నాడు జరిగింది. సమావేశంలో సిపిఐ రాష్ర్ట సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు,
పోడు భూములకు పట్టాలివ్వకుంటే పోరాటం ఉధృతం
RELATED ARTICLES