టి20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విథాలీరాజ్
ముంబయి: పరుగుల రాణి మిథాలీరాజ్ టి20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. 2021 వన్డే వరల్డ్‌కప్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ తెలిపారు. మిథాలీ భారత టీ20 జట్టుకు తొలి కెప్టెన్‌గా 2006లో బాధ్యతలు స్వీకరించిన మిథాలీ.. ఇప్పటివరకు 89 మ్యాచ్‌లు ఆడారు. ఇందులో 32 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించారు. మూ డు టీ20 ప్రపంచకప్ (2012, 14, 16)లకు కెప్టెన్‌గా ఉన్నారు. 2364 పరుగులతో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రీడాకారిణిగా మిథాలీ నిలిచారు. కాగా, ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచే మిథాలీకి చివరిది. ఆ మ్యాచ్‌లో మిథాలీ 32 బంతుల్లో అజేయంగా 30 పరుగులు చేశారు. మిథాలీ రాజ్ టీ20ల్లో 2,364 పరుగులు చేశారు. ఇందులో 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ టీ20ల్లో ఆమె అత్యధిక స్కోరు 97 నాటౌట్. అన్ని పరుగులు చేసినా సెంచరీ మాత్రం చేయలేదు. యువ క్రీడాకారిణులకు పెద్ద పీట వేయాలనే ఆలోచనలో ఉన్న జట్టు మేనేజ్‌మెంట్.. సఫారీలతో సిరీస్‌కు మిథాలీని ఎంపిక చేసేందుకు సుముఖంగా లేకపోవడమే ఈ రిటైర్మెంట్‌కు కారణం అని తెలుస్తోంది.
వరల్డ్‌కప్ అందించడమే కల..
రిటైర్మెంట్‌పై మిథాలీ మాట్లాడుతూ.. ’2006 నుంచి భారత్ తరఫున టీ20లు ఆడుతున్నాను. 2021 వన్డే వరల్డ్‌ప్‌నకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడంపైనే దృష్టి సారించా. అందుకే టీ20ల నుండి రిటైర్ అవుతున్నా. భారత్‌కు వరల్డ్‌ప్‌ను అందించడమే నా కల. ఇప్పటివరకు నాకు అం డగా నిలిచిన బీసీసీఐకు ధన్యవాదాలు. సొంతగడపై టీ20 సిరీస్‌కు సిద్ధమవుతున్న భారత జట్టుకు శుభాకాంక్షలు ’ అని బిసిసిఐ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
పొట్టి క్రికెట్‌కు గుడ్‌బై
RELATED ARTICLES