కాలిఫోర్నియా: పొగమంచు కారణంగా అమెరికాలో రోడ్డు ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దక్షిణ కాలిఫోర్నియాలోని జాతీయ రహదారిపై పొగమంచు కారణంగా ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా 19 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 35 మంది గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ జాతీయ రహదారి దక్షిణ కాలిఫోర్నియా- లాస్‌వెగాస్ మధ్య ప్రధాన రహదారి కాగా.. రద్దీ ఎక్కువగా ఉండడం, పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
పొగమంచు కారణంగా 19 వాహనాలు ఢీ
RELATED ARTICLES