భయపెడుతున్న వర్షాకాల వ్యాధులు
వచ్చింది కరోనా జ్వరమా… లేక డెంగీ, మలేరియానా?
సాధారణ ఆరోగ్య సమస్యలకూ ఉలిక్కిపడుతున్న నగర వాసులు
కరోనాకు సీజనల్ వ్యాధులు తోడైతే ప్రాణాంతకమేనంటున్న వైద్యులు
అదనపు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న డాక్టర్లు
ప్రజాపక్షం/హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు సకాలంలో వచ్చేయడంతో హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సాధారణ సమయాల్లో అయితే ఇది ఎంతో సంతోషించాల్సిన విషయం. కానీ, ఇప్పుడు కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా వర్షాకాలం రావడంతో డెంగీ, మలేరియా, చికెన్ గున్యా, వైరల్ ఫీవర్ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు శివారు జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత సంవత్సరం డెంగీ కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. ప్రస్తుతం కరోనా సోకిన రోగులకు వైద్యసేవలు అందించేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక కరోనాకు తోడు సీజనల్ వ్యాధులు తొడైతే ఇక వైద్యం అందించడం మరింత క్లిష్టంగా మారుతోందంటున్నారు. జలుబు, జ్వరం, దగ్గు లాంటి సమస్య ఉంటే సీజనల్ వ్యాధినా లేకా కరోనా అనే విషయంపై ప్రస్తుతం నగరవాసులు టెన్షన్‌కు గురవుతున్నారు. దీనిపై హైదరాబాద్ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి వ్యాధి సోకినా ముందుగా జ్వరం రావడం సర్వసాధారణ విషయం అని తెలిసిందే. జ్వరం, జలుబు లాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తినా కరోనా వైరస్ సోకిందేమోననే అనుమానం వ్యక్తం అవుతున్నాయి. జలుబు, జ్వరం, దగ్గు లాంటి సమస్యలు కరోనా లక్షణాలుగా పేర్కొంటున్నారు. వర్షంలో ఎక్కువగా తడిసినా జలుబు, జ్వరం వస్తుంటాయి. డెంగీ, మలేరియా, వైరల్ ఫీవర్, చికెన్ గున్యా లాంటి అనారోగ్య సమస్యలు వస్తే ముందుగా జ్వరం వస్తుంది. తరువాత శరీరానికి అనుగుణంగా దగ్గు, జలుబు లాంటివి కూడా వస్తాయి. ప్రస్తుతం జ్వరం, జలుబు, దగ్గు ఉంటే కరోనా వైరస్ సోకిందనే భ్రమపడే పరిస్థితులు నెలకొన్నాయి. జులుబు, దగ్గు, జ్వరం వస్తే సాధారణ సీజనల్ వ్యాధినా, లేక కరోనా వైరస్ సోకిందా అనే విషయంపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో సీజనల్ వ్యాధులకు గురైన వారికి సాధారణ వైద్య సేవలు అందని పరిస్థితులు నెలకొంటాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా యి. ప్రభుత్వ ఆసపత్రుల్లో సైతం వైద్యం అందించేందుకు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది జంకుతున్నారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని వైద్య నిపుణలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ఆ సుపత్రుల్లో కొంతకాలం ఔట్‌పేషెంట్ సేవలను రద్దు చేశారు. ప్రస్తుతం ఔట్‌పేషెంట్ సేవలను పునరుద్ధరించారు. అయితే పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి రాలేదు. కార్పొరేట్ ఆసుపత్రుత్లో మాత్రం సేవలు కొనసాగుతున్నాయి. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులు తలకిందులు కావడంతో పేద, మధ్య తరగతి, సామాన్య ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి.
కరోనాకు సీజనల్ వ్యాధులు తోడైతే ప్రాణాలకు మరింత ప్రమాదం
కరోనా వైరస్‌కు సీజనల్ వ్యాధులు తొడైతే ప్రాణాలకు మరింత ప్రమాదకరంగా పరిస్థితులు మారుతాయని వైద్యులు చెప్పుతున్నారు. కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యాధులు కూడా సోకితే తట్టుకోవడం చాలా కష్టమంటున్నారు. రోగికి కరోనాతో పాటు డెంగీ కూడా సోకితే అది ప్రాణాంతకమవుతుందని వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. రోగి ఆరోగ్య పరిస్థితి కొద్దిసేపట్లోనే క్షీణిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జ్వరం వచ్చిన వాళ్లను వారం రోజుల పాటు ఇంటి వద్దనే క్వారంటైన్ లో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ ఆ జ్వరం డెంగీ అయితే ఆ వారం రోజుల్లో పరిస్థితి ఎంత విషమిస్తుందో ఊహించలేమంటున్నారు. డెంగీ, మలేరియా, వైరల్ ఫీవర్, చికెన్ గున్యాలతో పాటు కొవిడ్-19 లక్షణాలతో జ్వరం రావడం సాధారణ విషయమని అంటున్నారు. ఏ వ్యాధి వచ్చిన మొదట జ్వరం వస్తుంది. వ్యాధులను గుర్తించేందుకు సకాలంలో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే కరోనా వైరస్ విస్తరిస్తున్న ప్ర స్తుత తరుణంలో అన్ని వ్యాధులకు ఒకేసారి పరీక్షలు నిర్వహించడం రా బోయే రోజుల్లో అత్యంత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని అంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గితే ఇతర వ్యాధుల ను అదుపులోకి తీసురావచ్చాని వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నగర వాసులు ఎవ్వరికీ వారు స్వీయ రక్షణ చర్యలు తీసుకోవడమే ఉత్తమమైన మార్గమని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా నుంచి తప్పించుకునేందుకు అదనపు జాగ్రత్తలతో పాటు ఈ సీజనల్ వ్యాధులకు గురి కాకుండా ఉండేందుకు ఎవరికి వారు రక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. శానిటైజేషన్, మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వల్ల కరోనాను కట్టడి చేయవచ్చని, కానీ వర్షాకాలంలో వచ్చే వ్యాధుల బారినపడకుండా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎంతో ప్రధానమని సూచిస్తున్నారు. దోమల నివారణ కోసం నివాసాల చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా ఎవరికీ వారు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.