శ్రీలంకలో 24 మంది అరెస్టు
290కి పెరిగిన మృతుల సంఖ్య
87 బాంబు డిటోనేటర్లు స్వాధీనం
అర్ధరాత్రి నుంచి అత్యవసర పరిస్థితి విధింపు
బాధితులకు పరిహారం ప్రకటన
ఎనిమిదికి చేరిన భారత మృతులు
కొలంబో: శ్రీలంకలో ఆదివారం ఈస్టర్ రోజున చర్చిలు, లగ్జరీ హోటళ్లలో వరుస బాంబు పేలు ళ్లకు పాల్పడింది ఇస్లాం తీవ్రవాద గ్రూపులకు చెందిన ఏడుగురు లంక ఆత్మాహుతి బాంబర్లే నని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా బాంబు పేలుళ్లలో మృతుల సంఖ్య 290కి పెరిగిందని, 500 మంది గాయపడ్డారని అధికారులు సోమ వారం తెలిపారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నేతృత్వంలో జాతీయ భద్రతా మండలి సమావేశం జరిగింది. సోమవారం అర్ధరాత్రి నుంచి శ్రీలంకలో అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ) ప్రకటిస్తున్నట్లు ఈ సమావేశంలో నిర్ణయించా రు. బాంబు పేలుళ్లకు తామే బాధ్యులమంటూ ఇంతవరకు ఎవరు పేర్కొనలేదు. కానీ పోలీ సులు మాత్రం 24 మంది అనుమానితులను అరెస్టు చేశారు. వారిలో చాలామంది ఒకే గ్రూపు నకు చెందినవారు. అరెస్టయిన 24 మందిలో పేలుళ్లలో భాగం ఉన్న 9 మందిని మే 6 వరకు రిమాండులో ఉంచాల్సిందిగా కొలంబో మెజి స్ట్రేట్ ఉత్తర్వులిచ్చారు. ఈస్టర్ రోజు ఆదివారం మూడు చర్చిలు, మూడు ఫైవ్ స్టార్ హోటళ్లలో దాడులకు కుట్ర పన్నింది నేషనల్ తౌహీద్ జమాత్(ఎన్‌టిజె) అనే స్థానిక ఇస్లాం తీవ్రవాద గ్రూపు అని అనుమానిస్తున్నట్లు ప్రభుత్వ ప్రతి నిధి రజిత సేనరత్నే చెప్పారు. ‘అన్ని పేలుళ్లలో పాల్గొన్న ఆత్మాహుతి బాంబర్లు శ్రీలంక జాతీ యులే’ అని ఆరోగ్య శాఖ మంత్రి కూడా అయిన రజిత సేనరత్నే తెలిపారు. ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘ఈ గ్రూపునకు అంతర్జాతీయ మద్దతు ఉందా అనేది దర్యాప్తు చేస్తున్నాం’ అని చెప్పారు. కాగా బాంబు పేలు ళ్లను ఏడుగరు ఆత్మాహుతి బాంబర్లు నిర్వహించి నట్లు ప్రభుత్వ విశ్లేషణ శాఖ పేర్కొంది. శ్రీలంక వరుస బాంబు పేలుళ్లలో ఆరుగురు భారతీయు లు సహా 290 మంది మరణిచారని, 500 మందికిపై గాయపడ్డారని పోలీసు ప్రతినిధి రువాన్ గుణశేఖర తెలిపారు. క్రిమినల్ ఇన్వె స్టిగేషన్ డిపార్ట్‌మెంట్(సిఐడి) ఇప్పటి వరకు 24 మంది అనుమానితులను అరెస్టు చేసింది. సోమవారం అర్ధరాత్రి నుంచి ‘అత్యవసరపరిస్థితి’ని ప్రకటిస్తున్నట్లు జాతీయ భద్రత మండలి(ఎన్‌ఎస్‌సి) ప్రకటించింది. ఉగ్రవాదం లక్ష్యంగానే చర్యలుంటాయే తప్ప భావస్వేచ్ఛను పరిమితం చేసే చర్యలుండబోవని ఎన్‌ఎస్‌సి పేర్కొ ంది. ఇదిలా ఉండగా మంగళవారం ‘జాతీయ సంతాప దినం’గా శ్రీలంక ప్రభుత్వం ప్రకటించిం ది. దర్యాప్తుకు ముగ్గురు సభ్యుల కమిటీని అధ్యక్షుడు సిరిసేన నియమించారు. ఈ కమిటీ రెండు వారాల్లో అధ్యక్షుడికి నివేదిక అందించనుంది. ఏప్రిల్ 11 కన్నా ముందే దాడులు జరగొచ్చని పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్(ఐజిపి)కి నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ హెచ్చరించిందని ఆరోగ్య మంత్రి సేనరత్నే చెప్పారు. భద్రత లోపం స్పష్టమైనందున పోలీస్ చీఫ్ పుజిత్ జయసుందెర రాజీనామా చేయాలని సేనరత్నే డిమాండ్ చేశారు. దాడులు జరుగుతాయన్న ఇంటెలిజెన్స్ నివేదికను ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదన్న విషయంపై దర్యాప్తు చేపట్టనున్నట్లు ప్రధాని రనిల్ విక్రమసింఘే చెప్పా రు. సమాచారం ఉన్నప్పటికీ నిరోధక చర్యలు చేపట్టకపోవడంపై శ్రీలంక ముస్లిం కాంగ్రెస్ నాయకుడు, మంత్రి రవూఫ్ హకీమ్ ఫైర్ అయ్యారు. శ్రీలంకలోని రెండు ముస్లిం గ్రూపులు- ది ఆల్ సిలోన్ జామియతుల్ ఉలామా, నేషనల్ షురా కౌన్సిల్ పేలుళ్లను ఖండించాయి. దోషులను పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశాయి.
87 బాంబు డిటోనేటర్లు స్వాధీనం
శ్రీలంక రాజధాని కొలంబో ఇంకా భయం గుప్పిట్లోనే ఉంది. కొలంబోలోని పెట్టా ప్రాంతంలో ఉన్న మెయిన్ బస్టాండ్ వద్ద సోమవారం పోలీసు లు 87 బాంబు డిటోనేటర్లను గుర్తించారు. మొద ట పోలీసులు 12 బాంబు డిటోనేటర్లను కనుగొన్నారు. కానీ తర్వాత మరింత గాలించాక మరి 75 బాంబు డిటోనేటర్లు లభించాయని పోలీసులు తమ ప్రకటనలో తెలిపారు. కొలంబో వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు దాడి వెనుక నేషనల్ తౌహీత్ జమాత్ హస్తముందని భావిస్తున్నారు. ఈ సంస్థకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు సహకరించాయని చెబుతున్నారు.
కొలంబో అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే రోడ్డులో ఆదివారం రాత్రి ఐఇడిని కనుగొన్నట్లు, దానిని డిఫ్యూజ్ చేసినట్లు శ్రీలంక వైమానిక దళం తెలిపింది. ‘అది ఆరు అడుగుల పైపు బాంబు’ అని వైమానికదళ ప్రతినిధి చెప్పారు.
మరో ఇద్దరు భారతీయులు మృతి
శ్రీలంక పేలుళ్లలో మరో ఇద్దరు భారతీయులు మృ తి చెందినట్లు సోమవారం భారత హైకమిషన్ ప్రకటించింది.వారిని కెజి హనుమంతరాయప్ప, ఎం. రంగప్పగా గుర్తించారు.ఆదివారం చనిపోయినవారిలో కేరళకు చెందిన పిఎస్ రజినా(58) ఉన్నారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. మొత్తంగా ఇప్పటి వరకు 8 మంది భారతీయులు చనిపోయారని కొలంబోలోని భారత హై కమిషన్ ట్వీట్ చేసింది. ఆ భారతీయులను వేమూరి తులసీరామ్, ఎస్‌ఆర్.నాగరాజ్, కెజి. హనుమంతరాయప్ప, ఎం.రంగప్ప, లక్ష్యి, నారాయణ చంద్రశేఖర్, రమేశ్, హెచ్. శివకుమార్‌గా గుర్తించారు.
పేలుళ్లకు పాల్పడింది ఏడుగురు
RELATED ARTICLES