మంత్రి తన్నీరు హరీశ్‌రావు
ప్రజాపక్షం/హైదరాబాద్ రాష్ట్రంలోని పేద మైనార్టీలకు ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం అందజేయనుందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రకటించారు. బ్యాంకులతో సంబంధం లేకుండా ఆర్థిక సాయం అందజేసే కార్యక్రమం ముఖ్యమంత్రి కెసిఆర్ పరిశీలనలో ఉన్నదని, దీనికి సంబంధించిన ఉత్తర్వలు మరో రెండు, మూడు రోజుల్లో జారీ చేస్తామన్నారు. హైదరాబాద్‌లోని జలవిహార్‌లో మైనార్టీ నేతల సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి హరీశ్ రావుతో పాటు మంత్రి మహమూద్ అలీ, ఎంపి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు షకీల్, దానం నాగేందర్, ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ మైనార్టీలకు సిఎం కెసిఆర్ ఎంతో గౌరవిస్తారన్నారు. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్‌లో
ఇంగ్లీష్ మీడియంతో పాటు ఉర్దూ మీడియం కూడా అందుబాటులోనికి తీసుకొచ్చారని తెలిపారు. మైనార్టీలు వైద్యులు, ఇంజనీర్లుగా ఎదుగుతున్నారని, ఉర్దూ మీడియంలో కూడా నీట్ నిర్వహించాలని అడిగిన ఒకే సిఎం కెసిఆర్ అని గుర్తు చేశారు. ముస్లిం అభివృద్ధి కోసం బిఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ ప థకాలను అమలు చేస్తుందన్నారు. దేశంలో ఇప్పటికీ ముస్లింలు పేదవారిగానే ఉన్నారని,ఇందుకు కాంగ్రెస్ పాలనే కారణమన్నారు. ఈ బడ్జెట్ రూ.2200 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారని , గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పది సంవత్సరాల్లో కూడా పెట్టలేదన్నారు. కాగా మైనార్టీ కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా నియమితులైన వారిని మంత్రులు సన్మానించారు.
పేద మైనార్టీలకు రూ.లక్ష ఆర్థికసాయం
RELATED ARTICLES