రేవంత్‌రెడ్డి ఆగ్రహం
ప్రజాపక్షం/హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రి రోగుల బంధువులు, సికింద్రాబాద్ రైల్యే స్టేషన్ దగ్గర వలసకూలిలకు భోజనాలు పెట్టడానికి వెళుతున్న మల్కాజిగిరి ఎంపి, టిపిసిసి వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డిని బేగంపేటలో పోలీసులు అడ్డుకున్నారు. వాహనాన్ని చుట్టుముట్టి ముందుకు కదలనీయలేదు. దీంతో పోలీసులతో రేవంత్ వాగ్వాదానికి దిగారు. ఓ ఎంపిగా నియోజకవర్గంలో కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి వెళుతుంటే ఇలా అడ్డుకోవడం ఏమిటని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను స్థానిక ఎంపినని తనను ఆపమని చెప్పిందెవడు? మీకు ఆదేశాలు ఎవరిచ్చారో చెప్పండి, ఆ కాగితాలు చూపండి అంటు పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించారు. తాను ఇక్కడి ఎంపినని ఆంక్షలు గాంధీ ఆసుపత్రి దగ్గర పెట్టుకోవాలని, బేగం పేటలో కాదన్నారు. తాను గాంధీ, సికింద్రాబాద్, బేగంపేట్ తదితర ప్రాంతాల్లో కార్యక్రమాలు పెట్టుకున్నానని తెలిపారు. మీలాగే నేను కూడా రోడ్డు మీదకు ప్రజలకు సేవ చేయడానికి వచ్చానన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజల దగ్గరకు వెళుతుంటే ఎందుకు ఆపుతున్నారని రేవంత్ రెడ్డి పోలీసులను ప్రశ్నించారు. గాంధీ ఆసుపత్రి దగ్గర రోగుల బంధువులకు రోజు వెయ్యి మందికి భోజనం పెట్టే కార్యక్రమాన్ని శనివారం రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. రెండో రోజు ఈ కార్యక్రమాన్ని గాంధీతో పాటు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ల దగ్గర చేపట్టాలని ఆయన భావించారు. ఈ నేపథ్యంలోనే
ఎంపి రేవంత్‌ను బేగంపేట పోలీస్ స్టేషన్ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు.
పేదవాడి ఆకలిపై రాజకీయాలు చేస్తారా? : రేవంత్ రెడ్డి ఆగ్రహం
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, గాంధీ ఆసుపత్రి వద్ద పేదలకు పట్టెడన్నం పెట్టేందుకు వెళుతుంటే తన వాహనాన్ని ఆపారని రేవంత్ మండిపడ్డారు. ప్రభుత్వ అమానవీయ చర్యలు పరాకాష్టకు చేరుకున్నాయని విమర్శించారు. కంటోన్మెంట్ ప్రాంతంలో కొవిడ్ కేంద్రంగా మార్చిన ఓ ఆసుపత్రి వద్ద జరుగుతున్న పనులను కూడా తాను పర్యవేక్షించాల్సి ఉందన్నారు. పేదవాడి ఆకలిపై రాజకీయాలు చేస్తారా అని ప్రశ్నించారు. నన్ను ఆపడం అంటే గరీబోడి నోటికాడ కూడు లాగేసే ప్రయత్నమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక సేవలోనూ రాజకీయాలు వెతికే ప్రయత్నం దుర్మార్గం అని విమర్శించారు.
పేదవాడి ఆకలిపై రాజకీయాలు చేస్తారా?
RELATED ARTICLES