ఎన్‌ఆర్‌ఐ పెళ్లిళ్లలో మోసాలే ఎక్కువ
ఏటా వందకు పైగా విడాకుల కేసులు
గ్రీన్‌కార్డుంటే అమెరికా పౌరసత్వం
భారత చట్టాలు వారికి బేఖాతర్
ప్రజాపక్షం / హైదరాబాద్ : ఎన్‌ఆర్‌ఐ పెళ్లిళ్లంటే ఒకప్పుడే భలే క్రేజీ ఉండే ది. పెళ్లీడుకు వచ్చిన అమ్మాయిలను ఓ ఇంటి దాన్ని చేయాలని ఆలోచన వచ్చిన సంపన్న వర్గ కుటుంబాలు.. రాష్ట్రంలోని సంబంధాలు కాకుండా అమెరికా, యుఎస్ సంబంధాలంటేనే మోజుపడే వారు. పైగా “కాబోయే అల్లు డు గారు బంగారం.. అమెరికా గ్రీన్‌కార్డు హోల్డర్.. సంపాదన కూడా డాలర్లలోనే ఇం కేం మా అమ్మయి అదృష్టవంతురాలే..” అం టూ సంబరపడే వారు. అవన్నీ ఒకప్పటి రోజు లు. ఇప్పుడు జరుగుతున్న ఎన్‌ఆర్‌ఐ పెళ్ళిళ్లలో చాలా వరకు కాపురాలు సజావుగా సాగడమే లేదు. ఆరు మాసాలు, ఏడాది కాపు రం చేసి ఆ తర్వాత తమ అసలు రూపం బయట పెట్టుకుంటున్నారు. కట్న కానుకలు ఎన్ని ఇచ్చినా.. ఎన్‌ఆర్‌ఐ అల్లుళ్లలో అదనపు కట్న కాంక్ష మాత్రం తగ్గడం లేదు. దీంతో కొత్తగా పెళ్లి అయిన ఏడాదిలోనే అదపపు కట్నం కోసం వేధించడం ప్రారంభిస్తున్నారు. ఎన్‌ఆర్ ఐ అల్లుడు కోరిన నజరానాలను సమర్పించుకోక పోతే ఆ పెళ్ళిళ్లు ఏడాది కూడా తిరగకుండానే పెటాకులవుతున్నాయి.
ఏడాదిలో పెటాకులైన వెయ్యి పెళ్ళిళ్లు !
తెలుగు అమ్మాయిలను మోసం చేసి అమెరికా అమ్మాయిలతో జల్సాలు చేస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో భారీగానే పెరిగాయి. ఏడాది వ్యవధిలోనే (2017- ఫిబ్రవరి మధ్య కాలంలో ) ఎన్‌ఆర్‌ఐ పెళ్లిళ్లలో విడాకులు పొందిన కేసుల సంఖ్య వంద దాటాయని అధికార వర్గాల సమాచారం. కోరిన కట్నం ఇచ్చుకున్నా.. ఇంకా ఇంకా.. అమ్మా యి ఇంటి వారి నుండి గుంజాలనుకునే అబ్బాయిల ఆశనే ఇందుకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. అమెరికన్ గ్రీన్‌కార్డు హోల్డర్ అనగానే సహజంగానే తెలుగు రాష్ట్రాల్లోని అమ్మాయి తల్లిదండ్రులు ఇష్టపడి పెళ్ళిళ్లు చేస్తున్నారు. అమెరికాకు కాపురానికి తీసుకెళ్లి ఏడాది రెండేళ్లు కూడా గడవక ముందే విడాకుల దిశగా అబ్బాయిల చర్యలు ఉంటుండడం ఇప్పుడు అమ్మాయి తరఫు తల్లిదండ్రులు, బంధుమిత్రులను తీవ్ర కలవరానికి గురి చేస్తోంది. రాష్ట్రంలోనే సంబంధాలు చేసి పెళ్లి చేసినా కనీసం అమ్మాయిని కంటి ముందు అయినా ఉండేదని, దేశం కానీ దేశంలో పరాయి భాషలో మాట్లాడే అమెరికాలో అమ్మాయి పరిస్థితులను ఆరా తీసే పరిస్థితులు కూడా కనిపించడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. పెళ్లి సమయంలో అబ్బాయి తరఫు వారు కోరిన కట్నాలు, లాంఛనాలను లక్షల్లో సమర్పించి ఇక తమ బిడ్డకు ఎలాంటి లోటు లేకుండా అల్లుడు చూసుకుంటారనుకుంటున్న తరుణంలో అల్లుడే అసలు సమస్యకు కారకుడు కావడం వారు జీర్ణించుకోవడం లేదు.