మాస్టర్ బ్లాస్టర్ సచిన్
న్యూఢిల్లీ: భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ పెర్త్ పిచ్‌కి ఫుల్ మార్క్ వేశాడు. ఇటీవలే భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన పెర్త్ వేదికగా జరిగిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం ఐసిసి మ్యాచ్ రెఫరీ రంజన్ మదుగలే పిచ్‌కు తక్కువ రేటు ఇచ్చారు. పిచ్ యావరేజ్గాఉందని తన నివేదికలో రంజన్ పేర్కొన్నారు. టెస్టు మ్యాచుల్లో పిచ్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. బ్యాట్స్మెన్లకు, బౌలర్లకు సమరంలో పిచ్‌లో విజేతలను నిర్ధ్దారిస్తాయి. ఐదురోజులపాటు జరిగే మ్యాచ్‌లో పిచ్ భూమిక ముఖ్యంగా ఉంటుంది. ఐసిసి నిబంధనల ప్రకారం పిచ్ బ్యాలెన్స్‌గా ఉండాలి. బ్యాట్స్‌మెన్స్, బౌలర్లకు సమానంగా ఉపయోగపడాలి. వీరిలో ఎవరు బలంగా ఉంటారో విజయం వారినే వరిస్తోంది. అయితే తాజాగా పెర్త్ పిచ్‌కు ఐసిసి రెఫరీ తక్కువ రేటింగ్ ఇచ్చారు. దీనిపై స్పందించిన సచిన్ తనకైతే పెర్త్ పిచ్ ఏ సందర్భంలో కూడా యావరేజ్‌గా కనిపీయలేదని అన్నారు. అక్కడి పిచ్ బ్యాట్స్‌మెన్స్, బౌలర్లకు సమానంగా ఉంది. నా దృష్టిలో అలాంటి పిచ్‌లు మరిన్ని తయారు చేయాలని సచిన్ టెండూల్కర్ అన్నారు. మరోవైపు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మిచ్ల్ జాన్సన్ కూడా పిచ్‌పై స్పందిస్తూ తనకు పిచ్‌పై ఎలాంటి లోపము కనిపించలేదని ట్వీట్ చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్‌కు మంచిగా సహకరించిందని జాన్సన్ అన్నాడు.
పెర్త్ పిచ్‌లో ఏ లోపం కనబడలేదు
RELATED ARTICLES