హైదరాబాద్‌లో పెట్రోల్
రూ. 96.22, డీజిల్ రూ. 90.73
న్యూఢిల్లీ : వరుసగా పెరుగుతూ వచ్చిన పెట్రో ధరల పెరుగుదలకు నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల సమయంలో బ్రేక్ పడినప్పటికీ, ఫలితాలు వెలువడిన తర్వాత మళ్లీ ఆకాశానికి ఎగబాకుతున్నాయి. శనివారం విరామాన్నిచ్చిన చమురు విక్రయ సంస్థలు ఆదివారం మరోసారి ధరలను పెంచడంతో పెట్రో మంటలు తీవ్రమయ్యాయి. లీటరు పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 27 పైసలు చొప్పున పెంచుతూ చమురు విక్రయ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఫలితంగా హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 96.22 రూపాయలకు, లీటర్ డీజిల్ 90.73 రూపాయలకు చేరింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో లీటరు పెట్రోలు వంద రూపాయలు దాటగా, మిగతా రాష్ట్రాల్లోనూ త్వరలోనే అదే పరిస్థితి కనిపించడం ఖాయం. ఇంధన ధరల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఎక్కువగా ఉన్న కారణంగా, పెట్రో ధరలు మోయలేని భారమయ్యాయి. లీటర్ పెట్రోలపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ పన్ను రూపంలో 32.90 రూపాయలు వసూలు చేస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై చర్చించి, ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్న వాదనను ఇప్పటి వరకూ ఎవరూ పట్టించుకోలేదు. పెట్రో ఉత్పత్తులను జిఎస్‌టిలో చేర్చాలన్న సూచనను కూడా కేంద్రం పట్టించుకోవడం లేదు. దీనితో పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. లీటర్ పెట్రోల్ 150 రూపాయలకు చేరే వరకూ ఈ పెంపు ఇదే విధంగా కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలావుంటే, తాజా పెంపుతో లీటర్ వివిధ నగరాల్లో ధరలు ఇలావున్నాయి.. హైదరాబాద్‌ః రూ. 96.22 (పెట్రోలు), రూ. 90.73 (డీజిల్), ఢిల్లీః రూ. 92.58 (పెట్రోలు), రూ. 31.80 (డీజిల్), ముంబయిః రూ. 98.88 (పెట్రోలు), రూ. 90.40 (డీజిల్), కోల్‌కతాః రూ. 92.67 (పెట్రోలు), రూ. 86.06 (డీజిల్), చెన్నై ః రూ. 94.31(పెట్రోలు), రూ. 88.07 (డీజిల్), బెంగళూరుః రూ. 95.33 (పెట్రోలు), రూ. 87.92 (డీజిల్), తిరువనంతపురంః రూ. 94.81 (పెట్రోలు), రూ. 89.70 (డీజిల్).
‘పెట్రో’ మంటలు
RELATED ARTICLES