పలు ప్రాంతాల్లో వినూత్న నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు
పెట్రోలియం మంత్రి రాజీనామా చేయాలి
ఇండియన్ యూత్ కాంగ్రెస్ డిమాండ్
తక్షణం ఎక్సైజు సుంకాన్ని తగ్గించాలి
ఇది మోడీ తప్పుడు ఆర్థిక విధానాల ఫలితమే : గెహ్లోత్
న్యూఢిల్లీ: దేశంలో వరుసగా పన్నెండో రోజు కూడా పెట్రోలు ధరలు పెరిగిపోయాయి. దీంతో శనివారంనాడు చమురు విక్రయ కంపెనీలు పెట్రోలు డీజిలు ధర ల పెంపులో రికార్డు సృష్టించినట్లయింది. ధరలు ఇలా ఆడ్డూ అదుపూ లేకుండా తారా మండలానికి దూసుకుపోవడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. పెట్రోలు ధరల సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని మరోవైపు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటు సామాన్య ప్రజలు, గృహిణులు, చిన్న వ్యా పారులు, వాణిజ్య వాహన యజమానులు, లారీ యజమానుల సంఘాలు మీదు మిక్కిలి వివిధ రాజకీయపార్టీల నాయకులు, కార్యకర్తలు పెరుగుతున్న పెట్రోలు ధరలపై మండిపడుతున్నారు. దేశవ్యాప్తంగా అనేకచోట్ల నిరసనజ్వాల రగులుతున్నప్పటకీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చీమకుట్టినట్టు కూడా స్పందించడంలేదు. ఇప్పటికే వామపక్షాలు ప్రజల్లోకి దూసుకుపోయాయి. ప్రత్యేకించి భారత కమ్యూనిస్టుపార్టీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రాస్తారోకోలు, వినూత్నపద్ధతుల్లో నిరసన ప్రదర్శనలు చేస్తూ
పెట్రోలు ధరలపై రగులుతున్న భారతం
RELATED ARTICLES