చివరి రెండు టెస్టులకు భారతజట్టు ఖరారు
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో ఆఖరి రెండు టెస్టులకు భారత జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) సెలక్షన్ కమిటీ సోమవారంనాడు ప్రకటించింది. యువ క్రికెటర్ పథ్వీ షా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. గాయం నుంచి తిరిగి కోలుకోకపోవడంతో అతడికి విశ్రాంతినిచ్చారు. షా స్థానంలో టీమ్‌లోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ ఓపెనర్‌గా బరిలో దిగే ఛాన్స్ ఉంది. రెండో టెస్టులో భారత్ ఓటమి దిశగా సాగుతుండటంతో తదుపరి టెస్టుకు టీమ్ మేనేజ్మెంట్ జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. మూడో టెస్టు డిసెంబర్ 26న మెల్బోర్న్లో ప్రారంభంకాగా..జనవరి 3న ఆరంభంకానున్న ఆఖరిదైన నాలుగో టెస్టుకు సిడ్నీ ఆతిథ్యమిస్తోంది. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి టెస్టులో గెలిచిన కోహ్లీసేన 1-0తో ఆధిక్యంలో ఉంది.
భారతజట్టు : విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, కెఎల్ రాహుల్, ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, హనుమ విహారి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, పార్థీవ్ పటేల్, అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా, మయాంక్ అగర్వాల్.
పథ్వీషా అవుట్.. ఊహించనది!
రెండో టెస్ట్‌లో ఓటమి అంచున ఉన్న టీమిండియాకు మరో షాక్ తగిలింది. యువ బ్యాట్స్‌మన్ పథ్వీ షా మడమ గాయం కారణంగా ఆస్ట్రేలియాతో సిరీస్ మొత్తానికీ దూ రమయ్యాడు. దీంతో అతని స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేశారు. క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ పథ్వీ షా గాయపడిన విషయం తెలిసిందే. ఈ గాయం కారణంగా రెండు టెస్టులకు అతను దూరమయ్యాడు. అయితే రెం డో టెస్ట్‌కు ముందు అతను జాగింగ్ చేస్తుండటంతో కనీసం మూడో టెస్ట్ నాటికి కోలుకుంటాడని అనుకున్నారు. కానీ అతను ఫిట్‌గా ఉండే అవకాశం లేకపోవడంతో ఇండియాకు పంపించేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం రెండు టెస్టుల్లో ఓపెనర్లుగా వస్తున్న మురళీ విజయ్, కెఎల్ రాహుల్ తీవ్రంగా నిరాశపరిచారు. మరోవైపు దేశవాళీ క్రికెట్లో టాప్ ఫామ్‌లో ఉన్న మయాంక్ అగర్వాల్ ఆస్ట్రేలియా ట్కఫ్లెటెక్కనున్నాడు. అటు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా మూడో టెస్ట్ తర్వాత టీమ్‌తో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతను ఇప్పటికే ఫిట్నెస్ ప్రూవ్ చేసుకున్నాడు.
పృథ్వీషా స్థానంలో మయాంక్!
RELATED ARTICLES