న్యూఢిల్లీ : భారత యువ బ్యాట్స్‌మన్ పృథ్వీ షాకు మంచి భవిష్యత్తు ఉందని ఇప్పటికే ఎందరో సీనియర్ క్రికెటర్లు చెప్పిన విషయం తెలిసిందే. 19 ఏళ్ల యువ క్రికెటర్ షా రానున్న కాలంలో భారత జట్టులో కీలక ఆటగాడిగా మారనున్నాడని చాలామంది అభిప్రాయపడ్డారు. అతనిలో అపారమైన ప్రతిభ ఉందని, అంతని బ్యాటింగ్ స్టయిల్ డిఫరెంట్‌గా ఉంటుందని, ఎలాంటి సందర్భంలోనూ ఆడగల సత్తా అతనిలో ఉందని ఎందరో దిగ్గజాలు చె ప్పుకొచ్చారు. ఇక తాజాగా వెస్టిండీస్ మాజీ దిగ్గజ క్రికెటర్ బ్రియన్ లారా కూడా పృథ్వీ షాపై ప్రశంసల వర్షం కురిపించాడు. అంతే కాకుండా షా బ్యాటింగ్ స్టయిల్ అచ్చం వీరేంద్ర సెహ్వాగ్‌లా ఉం దని పేర్కొన్నాడు. సెహ్వాగ్‌ల దూకుడుగా ఆడే స త్తా షాకు ఉందని, అతనిలో అసాధారణమైన ప్రతి భ దాగుందని లారా చెప్పాడు. ఇంకా ఇరవై ఏళ్లు కూడా నిండకపోయినా అతని అద్భుతమైన బ్యా టింగ్‌తో అందరిన ఆకర్షించాడు. వేగంగా బంతిని కొట్టడం, దూకుడుగా ఆడడం ఇవన్ని సెహ్వాగ్ పో లికలేనని విండీస్ దిగ్గజం తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇంత చిన్న వయసులో రెండు ఐపిఎల్ సీ జన్‌లు ఆడేశాడు. రానున్న కాలంలో భారత జట్టు కు ఆశాకిరణంగా షా మారబోతున్నాడని లారా ఆ శాభావం వ్యక్తం చేశాడు. మరోవైపు తన నైపుణ్యమైన బ్యాటింగ్‌తో చిన్న వయసులోనే జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. టీనేజ్‌లోనే జాతీ య జట్టుకు ఎంపికై తన కెరీర్ తొలి టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ బాదేసి కొత్త రికార్డు సృష్టించాడు. తన సత్తేంటో ప్రపంచానికి చూయించాడు. షా నా యకత్వంలోని అండర్ భారత్ జట్టు 2018 లో ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ప్ర స్తుతం ఐపిఎల్ కొత్త సీజన్‌లో పృథ్వీ షా ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రతినిథ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్‌లో షా 6 మ్యాచ్‌లు ఆడి 169 పరుగులు చేశాడు. ఒక మ్యాచ్‌లో మాత్రం (99) పరుగుల వద్ద ఆవుటై తృటిలో శతకం చేజార్చుకున్నాడు.
పృథ్వీషాలో సెహ్వాగ్ పోలికలు ఉన్నాయి: బ్రియన్ లారా
RELATED ARTICLES