మమతపై దాడి కేసులో సమగ్ర నివేదిక కోరిన ఎన్నికల సంఘం
కోల్‌కత : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నందిగ్రామ్‌లో మార్చి 10వ దీన ఉద్దేశపూర్వక దాడిగా ఆరోపించిన ఘటనపై నివేదిక కేంద్ర ఎన్నికల సంఘానికి చేరింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ నివేదికను ఇసికి సమర్పించింది. ఈ ఫిర్యాదు కేవలం రేఖామాత్రంగానే ఉం దని, దీనిపై సవివరమైన సమాచారాన్ని సమగ్ర నివేదికలా సమర్పించాలని ఆ రాష్ట్ర ముఖ్యకార్యదర్శి అలప్పన్ బందోపాధ్యాయ్‌ను ఎన్నికల సంఘం శనివారంనాడు కోరింది. ఈ ఘటన ఎలా జరిగింది? దీని వెనుక ఎవరున్నారు? లాంటి సంపూర్ణమైన సమాచారాన్ని వచ్చే శనివారంనాటికి సమర్పించాలని ఇసి కోరినట్లు ఎన్నికల అధికారి చెప్పారు. ప్రభుత్వం సమర్పించిన నివేదిక కేవలం రేఖామాత్రంగానే ఉంది తప్ప ఎలాంటి సమాచారం అందులో లేదని, పూర్తి వివరాలతో సంపూర్ణమైన నివేదిక తమకు అందించాలని రాష్ట్ర యంత్రాంగాన్ని తాము కోరామని ఎన్నికల అధికారి పిటిఐ వార్తాసంస్థకు చెప్పారు. ఈ ప్రాంతంలో భారీగా జనం గుమిగూడి ఉన్నారని, అయితే మమతాబెనర్జీ ఆరోపించినట్టుగా నలుగురైదుగురు దాడి చేసినట్లుగా ఆ ఫిర్యాదు సమాచారంలో ప్రత్యేకంగా పేర్కొనలేదని ఆయన అన్నారు. పర్బా మెదనిపూర్‌జిల్లా నందిగ్రామ్‌లోని బిరులియా బజార్‌లో బుధవారం సాయంత్రం జరిగిన ఈ దాడికి సంబంధిచిన వీడియో ఫూటేజ్ కూడా స్పష్టంగా లేదని, ఘటన జరిగిన తర్వాత ఇసి నివేదిక కోరిందని, ఇద్దరు ఎన్నికల పరిశీలకులను ఈ విషయమై నియమించిందని ఆయన చెప్పారు.
పూర్తి వివరాలివ్వండి
RELATED ARTICLES