బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన నికోలస్
దుబాయి: వెస్టిండీస్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నాలుగు మ్యాచ్‌లు నిషేధం విధించింది. లఖ్‌నవూ వేదికగా సోమవారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు బాల్‌టాంపరింగ్‌కు పాల్పడినందుకు ఐసీసీ ఈ శిక్షను విధించింది. ఐసీసీ ఆర్టికల్ 2.14 నిబంధనల ప్రకారం నికోలస్ లెవల్-3 తప్పుని చేశాడని ఐసీసీ తెలిపింది. తను చేసిన పొరపాటుని నికోలస్ మంగళవారం అంగీకరించాడు. ’నేను చేసిన పొరపాటుకి క్షమాపణలు కోరుతున్నాను. దీనిపై ఐసీసీ ఎటువంటి చర్యలు తీసుకున్నా అంగీకరిస్తాను. దీనిని ఎన్నటికీ పునరావృతం చేయను’ అని తెలిపాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో 5 డీమెరిట్ పాయింట్లు ఉన్నాయి. అఫ్గాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను విండీస్ 3-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
పూరన్‌పై నాలుగు మ్యాచ్‌ల నిషేధం
RELATED ARTICLES