మీర్‌పూర్: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోమవారం నాడు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పిఒకె)లో పర్యటించారు. ఇటీవల భూకంపాల తాకిడికి గురైన మీర్‌పూర్ జిల్లాలో ఆయన తన పర్యటన సాగించారు. అక్కడ జరిగిన ప్రాణనష్టం, కొనసాగుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలను సమీక్షించారు. పిఒకె ప్రధాని ఫరూఖ్ హైదర్‌తో సమావేశమయ్యారు. పాక్ విదేశాంగ మంత్రి మెహమూద్ ఖురేషి, కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్థాన్ వ్యవహారాల మంత్రి అలి అమిన్ గాందపూర్, ఎన్‌డిఎంఎ చైర్మన్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అఫ్జల్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. డివిజనల్ హెడ్‌క్వార్టర్స్ ఆసుపత్రిని సైతం ఇమ్రాన్ ఖాన్ సందర్శించి, భూకంపంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.
పిఒకెలో పాక్ ప్రధాని పర్యటన
RELATED ARTICLES