తుది అటవీ అనుమతులు మంజూరు చేసిన కేంద్రం
ప్రాజెక్టు పూర్తయితే 12.3 లక్షల ఎకరాలకు సాగునీరు
వేగవంతం కానున్న పనులు : సిఎం కెసిఆర్ హర్షం
హైదరాబాద్ : కోటి ఎకరాలకు సాగునీరందించాలన్న లక్ష్యం లో కీలకమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ తుది అటవీ అనుమతులను మంజూరు చేసింది. అనుమతులు జారీచేసిన లేఖ శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులకు అందింది. ఈ విషయం తెలిసిన సిఎం అనుమతులు మంజూరుచేసినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. దీని కోసం కృషి చేసిన రాష్ట్ర నీటిపారుదల, అటవీశాఖ అధికారులను అభినందించారు. తుది అనుమతులు రావడంతో ఇక ప్రాజెక్టు నిర్మాణం పనులు వేగవంతం కానున్నాయి. ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మ డి మహబూబ్‌నగర్ జిల్లా, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 12.3 లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు గ్రీన్‌సిగ్నల్
RELATED ARTICLES