HomeNewsBreaking Newsపాలమూరులో ప్రధాని చెప్పింది పచ్చి అబద్ధం

పాలమూరులో ప్రధాని చెప్పింది పచ్చి అబద్ధం

గొప్ప దార్శనిక ముఖ్యమంత్రి కెసిఆర్‌
వారంటీ అయిపోయిన కాంగ్రెస్‌ పార్టీకి గ్యారెంటీ లేదు
నల్లగొండ ప్రగతి నివేదన సభలో మంత్రి కెటిఆర్‌
ప్రజాపక్షం/నల్లగొండ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రంలో మోడీ ప్రజలకు అబద్ధాలు ప్రచారం చేసేందుకే పర్యటిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, బిఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో ప్రజారంజక పాలన చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌ గొప్ప దార్శనికుడని చెప్పా రు. అరువై ఏళ్లలో చేయలేని అభివృద్ధి ముఖ్యమం త్రి కెసిఆర్‌ తొమ్మిదేళ్లలోనే చేసి చూపించారు.. ప్రజల్లో వారంట్‌ లేని పార్టీ గ్యారెంటీతో ముందుకొస్తున్న కాంగ్రెస్‌ మాటలు నమ్మి మోసపోకుండా అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐటిహబ్‌తో పాటు 13 వందల కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఎన్‌జి కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ అద్భుతమైన పాలన అందిస్తుంటే దేశ ప్రధాని నరేంద్రమోడీ పాలమూరుకు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడటం సిగ్గు చేటన్నారు. తెలంగాణ లో రైతుల రుణమాఫీ చేయకపోవడం వలనే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని నోటికొచ్చినట్లు ప్రధానమంత్రి స్థాయిలో మోడీ మాటలను తీవ్రంగా ఖండించారు. రెండు సార్లు 37 వందల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత కెసిఆర్‌కే దక్కిందన్నారు. దేశంలో హిందూ, ముస్లింల మధ్య ఘర్షణలు పెట్టి వాటిని రెచ్చగొడుతూ మైనార్టీలను ద్వితీయశ్రేణి వ్యక్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ దేశం నుంచి వెళ్లిపోవాలని మత విధ్వేషాలు రెచ్చగొడుతుంది బిజెపి అని విమర్శించారు. అరువై ఏళ్లుగా కరెంటు, సాగు, తాగునీరు ఇవ్వలేని కాంగ్రెస్‌… అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేందుకే మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. కరెంటు లేదని ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. 24 గంటల విద్యుత్‌ చెక్‌ చేయడానికి కాంగ్రెస్‌ నాయకులు అందరూ రండి ఎక్కడికి వస్తారో.. రండి బస్‌ చార్జీలు తామే భరిస్తామని వచ్చి కరెంటు తీగలు పట్టుకుంటే తెలుస్తుంది కరెంటు ఉందో లేదో అని, దీనితోనైనా వారి నుండి దేశానికి పట్టిన దరిద్రం కూడా పోతుందని ఎద్దేవా చేశారు. భారతదేశంలో రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చే ఒకే ఒక్కడు సిఎం కెసిఆరేనన్నారు. నల్లగొండ జిల్లాలోని దామరచర్లలో నిర్మితమవుతున్న 4000 ఆల్ట్రా మెగా పవర్‌ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి విరజిల్లే విద్యుత్‌ ఇస్తామంటే ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తాము అధికారంలోకి వస్తే ప్రాజెక్టును మూసివేస్తామని సిగ్గు లేని ప్రకటనలు చేశాడని విమర్శించారు. నల్లగొండ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కెసిఆర్‌ నిధులు ఇస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అంగ వైఖల్యం మీద మాట్లాడినోళ్లకు నెత్తి సక్కగ లేదని ఆయన మెదడు దెబ్బతిన్నదని విమర్శించారు. ఆరు దశాబ్దాలుగా జిల్లా ప్రజలను ప్లోరైడ్‌ మహామ్మారి పట్టి పీడిస్తుంటే అంశాల స్వామిని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రిని కలిసినా ప్లోరోసిస్‌ సమస్య తీరలేదు కానీ తొమ్మిదేళ్లలోనే మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి రక్షిత మంచినీరును అందించి ప్లోరోసిస్‌ను తరిమేసిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కిందన్నారు.విషయాన్ని మోడీ సైతం ఒప్పుకున్న నిజం వాస్తవమా కాదా అనే విషయం జిల్లా ప్రజలు గమనించాలన్నారు.
నల్లగొండ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన భూపాల్‌రెడ్డి
నల్లగొండ జిల్లాకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ వచ్చి ఎలా అభివృద్ధి చేయాలో స్వయంగా ఆయన ప్రణాళికను రూపొందించారని, మంత్రులు, అధికారులు నల్లగొండకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో జిల్లా కేంద్రంలో 4 కిలో మీటర్లు పాదయాత్ర చేసి అణువణువు అభివృద్ధిపై అంచనాలు వేసి వరదలా నిధులు కేటాయించడం జరిగిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అడిగిన ప్రతి అభివృద్ధి పనికి నిధులు ఇస్తే దగ్గరుండి సొంత ఇంటిని నిర్మించునే విధంగా నల్లగొండను అదే స్థాయిలో అభివృద్ధి చేశారని అభినందించారు. సంవత్సరం కాలంలోనే 90 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఐటిహబ్‌ నిర్మాణం పూర్తయింది. ఈ ప్రాంతం విద్యావంతులు స్థానికంగానే ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. త్వరలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రారంభం కాబోతుందన్నారు. అదే విధంగా నల్లగొండ జిల్లా కవులకు నెలవు అని అందుకోసం కళాభారతి నిర్మాణం కోసం 93 కోట్ల నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. ఉదయ సముద్రం, తీగల వంతెన, వరద నీటి కాలువలు, ఇంకా ఎన్నో పనులకు నిధులు కేటాయించామని, కోతల రాయుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేయలేని పనిని భూపాల్‌రెడ్డి చేసి చూపెట్టాడన్నారు.
ప్రతి జిల్లాలో మెడికల్‌ కళాశాల ..
రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కళాశాల ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రమేనని అన్నారు. మన పిల్లలు వైద్య విద్యను అభ్యసించి మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రతి జిల్లాకు మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేశామన్నారు. నాడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో నేను రాను బిడ్డో.. సర్కార్‌ దావాఖానకు అనే పాటను రాసుకుంటే నేడు తెలంగాణ ప్రభుత్వంలో ఏ జబ్బు వచ్చినా సర్కార్‌ దావాఖానాకు వెళ్లి నయం చేయించుకుంటున్నారని అన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments