HomeNewsBreaking Newsపాలమూరులో... కిడ్నాప్‌ల కలకలం

పాలమూరులో… కిడ్నాప్‌ల కలకలం

వరుస కిడ్నాప్‌లతో మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆందోళన
పాలమూరులో ఐదుగురు, ఢిల్లీలో నలుగురు అపహరణ
ప్రజాపక్షం / మహబూబ్‌నగర్‌ బ్యూరో పాలమూరు జిల్లాలో వరుస కిడ్నాప్‌లతో కలకలం నెలకొంది. రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని తలపించే విధంగా ఘటనలు జరగడంతో జిల్లా ప్రజ లు ఆందోళన చెందుతున్నారు. గత నెల 2 నుండి ఇప్పటివరకు జిల్లాకు చెందిన తొమ్మిది మంది కిడ్నాప్‌కు గురయ్యారు. పాలమూరు జిల్లాలో ఐదుగురు, ఇదే జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తు లు ఢిల్లీలో కిడ్నాప్‌కు గురికావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ విషయంపై ఇంతవరకు పోలీసు అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు గానీ నోరు మెదపకపోవడం గమనార్హం. గత నెల 23వ తేదీన మహబూబ్‌నగర్‌ పట్టణంలోని ఒక బేకరి ముందు నిలబడి ఉన్న చలువగాని నాగరాజు అనే వ్యక్తి కిడ్నాప్‌కు గురయ్యాడు. మరుసటి రోజు మైత్రి యాదయ్య అనే వ్యక్తి తన ప్రింటింగ్‌ప్రెస్‌లో ఉండగా, ఆర్డర్‌ ఉంది… కారు దగ్గరికి వచ్చి తీసుకోవాలని పిలుచుకుని వెళ్లి కారులోకి లాక్కొని తీసుకువెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బందేకర్‌ విశ్వనాథ్‌ను కూడా అదే రోజు కిడ్నాప్‌ చేశారు. కిడ్నాప్‌కు గురైన వారి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదు చేయడంతో పాటు మీడియాకు సైతం వివరాలు తెలిపారు. ఈ ఘటన పాలమూరులో తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో, మారణాయుధాలు కలిగి ఉన్నారనే కారణంగా వారిని అరెస్టు చేసినట్లు గత నెల 25న హైదరాబాద్‌లోని పోలీసులు ప్రకటించారు. కిడ్నాప్‌కు గురై న ఈ ముగ్గురు కలిసి హైదర్‌ అలీ అనే వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడ్డారని పేట్‌బషీరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసి ఆదివారం జుడిషియల్‌ కస్టడీకి తరలించారు. కిడ్నాప్‌కు గురైన వ్యక్తులు మరణాయుధాలతో ఎలా పట్టుపడతారని కుటుం బ సభ్యులతో పాటు విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కిడ్నాప్‌కు గురైన చలువగాని నాగరాజు భార్య అదే రోజు సాయంత్రం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా మొదట్లో టూ టౌన్‌ సిఐ సోమనారాయణ సింగ్‌ ఫిర్యాదును స్వీకరించలేదు. ‘నీ భర్త వస్తాడు ఎక్కడికి పోలేదు. రాజకీయాలు ఎందుకు’ అని సిఐ చిరాకు పడిన ట్టు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితులన్నింటినీ పరిశీలిస్తే ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై ఈ కిడ్నాప్‌ల వ్యవహారం నడిపిస్తున్నట్లు టిపిసిసి అధికార ప్రతినిధి ఎన్‌పి.వెంకటేశ్‌ మంగళవారం నాటి ప్రెస్‌మీట్‌లో తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా సోమవారం సాయంత్రం ఢిల్లీలోని సౌత్‌ అవెన్యూలో గల మాజీ ఎంపి, బిజెపి సీనియర్‌ నాయకుడైన ఎ.పి.జితేందర్‌రెడ్డి ఇంటిలోకి ఏడెనిమిది మంది ఆగంతకులు చొరబడి తెలంగాణ ఉద్యమ నాయకుడు, యువనేత మున్నూరు రవితో పాటు జితేందర్‌రెడ్డి పర్సనల్‌ కారు డ్రైవర్‌ దఫాను, మరో ఇద్దరిని కిడ్నాప్‌ చేశారనే వార్త పాలమూరులో తీవ్ర సంచలనం కలిగించింది. పార్లమెంటుకు, రాష్ట్రపతి భవన్‌కు కూతవేటు దూరంలో ఉండే ఈ అపార్ట్‌మెంట్‌లో కిడ్నాప్‌ జరగడం ఢిల్లీలో కలకలం రేగింది. ఈ విషయమై మంగళవారం మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి సౌత్‌ అవెన్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కిడ్నాప్‌ వ్యవహారం అంతా మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి ప్రోద్భలంతోనే జరిగిందని జిల్లాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ కిడ్నాప్‌ల సంఘటనలను ఖండిస్తూ బుధవారం మహబూబ్‌నగర్‌ జిల్లా ఎస్‌పి కార్యాలయాన్ని బిజెపి నాయకులు ముట్టడించారు. కిడ్నాప్‌కు గురైన వారిని విడిచిపెట్టాలని, అదృశ్యమైన వ్యక్తుల ఆచూకీ బహిర్గత పరచాలని డిమాండ్‌ చేస్తూ బిజెపి జిల్లా అధ్యక్షులు వీర బ్రహ్మచరి నేతృత్వంలో ఎస్‌పి కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించి ముట్టడి చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు బిజెపి కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో జరుగుతున్న కిడ్నాప్‌ సంఘటనలపై ప్రభుత్వం, పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments