HomeNewsBreaking News‘పారసైట్‌' హవా!

‘పారసైట్‌’ హవా!

నాలుగు విభాగాల్లో ఆస్కార్‌ సొంతం
ఉత్తమ నటుడిగా జాక్విన్‌
ఉత్తమ నటిగా రెంజి జెల్వెగర్‌
‘1917’కు మూడు
సినీ పరిశ్రమలోని ఉత్తమమైన పురస్కారం ఏదైనా ఉంది అంటే అది ఆస్కార్‌. ఆస్కార్‌ అవార్డు పొందడానికి నటులు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆస్కార్‌ మాత్రం కొంత మందిని వరిస్తూ ఉంటుంది. తాజాగా 92 వ ఆస్కార్‌ అవార్డుల ప్రధానోత్సవం ఈరోజు లాస్‌ ఏంజెల్స్‌ ఎంతో వైభవంగా ప్రారంభమైంది. డాల్బీ థియేటర్‌ లో జరుగుతున్న ఈ వేడుకకు ప్రముఖ హాలీవు్‌డ తారాగణమంతా హాజరై సందడి చేసింది. కాగా ఈ సందర్భంగా ఎంతోమంది ఆస్కార్‌ అవార్డును అందుకున్నారు. జోకర్‌ సినిమా హీరోయిన్‌ జిక్విన్‌ ఫీనిక్స్‌ ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకున్నారు. వన్స్‌ అపాన్‌ ఏ టైం ఇన్‌ హాలీవు్‌డ చిత్రంలో బ్రా్‌డ పిట్‌ నటనకు ఉత్తమ సహాయనటుడు అవార్డు దక్కింది. బెస్ట్‌ యానిమేటె్‌డ షార్ట్‌ ఫిలిం టాయ్‌ స్టోరీకి ఆస్కార్‌ అవార్డు దక్కింది. ఉత్తమ ఆనిమేటె్‌డ ఫీచర్‌ ఫిలిం గా టాయ్‌ స్టోరీ4 ఆస్కార్‌ అవార్డు దక్కింది. కాగా ఈ ఆస్కార్‌ ప్రధానోత్సవం లో భాగంగా పారసైట్‌ అనే సినిమాకి అవార్డుల పంట పండింది.బెస్ట్‌ వర్జినల్‌ స్క్రీన్‌ ప్లే, బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌, ఇంటర్నేషనల్‌ టీచర్‌ ఫిలిం గా, ఇలా వివిధ విభాగాల్లో పలు అవార్డులను దక్కించుకుంది. బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిలిం నైబర్స్‌ విండో అవార్డు దక్కింది. ఉత్తమ స్క్రీన్‌ ప్లే తైకా వేయిటిటి జోజో రాబిట్‌ ఆస్కార్‌ అవార్డు దక్కింది.
జాక్విన్‌ ఫొనిక్స్‌ రెండోసారి
ఇక ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఉర్రూతలూగించిన జోకర్‌ సినిమాలో నటనకుగానూ ప్రధాన పాత్ర పోషించిన జాక్విన్‌ ఫొనిక్స్‌కు ఉత్తమ నటుడి కేటగిరీలో ఆస్కార్‌ అవార్డు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను దక్కించుకున్న కిరాతకమైన కామిక్‌ క్యారెక్టర్‌ జోకర్‌. ప్రాణాలు క్షణాల్లో హరించే పాత్రల జోకర్‌.. అయితే ఈ జోకర్‌ ఎవరు? ఎందుకిలా మారాడు? ఏం సాధించాలనుకుంటున్నాడు? అనే ఆసక్తికర ప్రశ్నలకు సమాధానంగా 2019లో వచ్చిన మూవీ ’జోకర్‌’. సూపర్‌హీరో బ్యాట్‌మాన్‌ గురించి పెద్దగా ప్రస్తావించకుండా కేవలం అతని ప్రధాన శత్రువైన జోకర్‌ పాత్ర తెరకెక్కింది. ఓ పాత్రకు ఆస్కార్‌ రావడం ఇది రెండోసారి. హాలీవు్‌డ క్లాసిక్‌ సినిమాల్లో ఒకటైన ’గా్‌డ ఫాదర్‌’ సిరీస్‌ లో వీటో క్లారియన్‌ పాత్రకు రెండుసార్లు ఆస్కార్‌ వచ్చింది. ’ది గా్‌డ ఫాదర్‌’లో వీటో క్లారియన్‌ పాత్ర పోషించిన మార్లిన్‌ బ్రాండో ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అందుకున్నారు. తర్వాత ’ది గా్‌డ ఫాదర్‌’ సిరీస్‌ లో రెండో సినిమాలో వీటో పాత్ర పోషించిన రాబర్ట్‌ డి నీరో ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్‌ అందుకున్నారు. ’జోకర్‌’ విషయానికి వస్తే… ’బ్యాట్‌ మ్యాన్‌: డార్క్‌ నైట్‌’లో జోకర్‌ పాత్ర పోషించిన హీత్‌ లెడ్జెర్‌ ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్‌ అందుకున్నారు. అందులో ఆ పాత్రను బేస్‌ చేసుకుని ’జోకర్‌’ సినిమా వచ్చింది. ఈసారి జోకర్‌ పాత్ర పోషించిన జాక్విన్‌ ఫోనిక్స్‌ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.
పారసైట్‌ సంచలనం..
బెస్ట్‌ పిక్చర్‌ కేటగిరీలో.. వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌ ద ఐరిష్‌మాన్‌, పారసైట్‌, 1917, మారియేజ్‌ స్టోరీ, జోజో రాబిట్‌, జోకర్‌, లిటిల్‌ ఉమన్‌, ఫోర్డ్‌ వర్సెస్‌ ఫెరారి చిత్రాలు పోటీపడగా చివరకు పారసైట్‌ మూవీ ఆస్కార్‌ అవార్డు వరించింది. దీంతో ఈ ఆస్కార్‌ ఫంక్షన్‌లో పారసైట్‌ మూవీ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ సౌత్‌ కొరియన్‌ సినిమాకు బెస్ట్‌ పిక్చర్‌ సహా మూడు ఆస్కార్‌ అవార్డులు రావడం విశేషం. అంతేకాదు చరిత్రలో మొదటిసారి మెయిన్‌ కేటగిరిలో బెస్ట్‌ మూవీ అవార్డ్‌ అందుకున్న సినిమాగా పారసైట్‌ నిలిచింది. ఇప్పటివరకు జరిగిన ఆశాఖ వేడుకల్లో కేవలం ఇంగ్లీష్‌ మూవీస్‌ మాత్రమే మెయిన్‌ కేటగిరిలో బెస్ట్‌ పిక్చర్‌ అవారడ్స్‌ అందుకున్నాయి. కానీ మొదటిసారి ఓ కొరియన్‌ మూవీ (పారసైట్‌) ఫారిన్‌ కేటగిరిలో కాకుండా మెయిన్‌ కేటగిరిలో అవార్డు గెలుపొంది రికార్డు సృష్టించింది.
‘1917’ మూడు అవార్డులు..
ఈ వేడుకల్లో ‘1917’ సినిమా మూడు విభాగాల్లో (విజువల్‌ ఎఫెక్ట్‌, సౌండ్‌ మిక్సింగ్‌, సినిమాటోగ్రఫీ) అవార్డులను సొంతం చేసుకుంది. 92వ అకాడమీ అవార్డులకు ఈ సినిమా 10 నామినేషన్లు పొందడం విశేషం. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఆంబ్లిన్‌ పార్టనర్‌ సంస్థలు మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో నిర్మించిన ’1917’ చిత్రం ఇటీవల దేశవ్యాప్తంగా విడుదలైంది. సామ్‌ మెండెస్‌ (స్కై ఫాల్‌) ఫేమ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ వార్‌ ఎపిక్‌ డ్రామా ఇప్పటికే పలు అవార్డులను గెలుచుకుంది. అలాగే బఫ్టా అవారడ్స్‌కు ఈ సంవత్సరం 9 నామినేషన్లు పొందింది. అలాగే 77వ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల్లో ’1917’ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. దర్శకుడు సామ్‌ ఉత్తమ దర్శకుడిగా అవార్డు గెలుచుకున్నారు. ఏకంగా ఏడు బాఫ్టా అవారడ్స్‌ గెలుచుకుని సత్తా చాటిందీ చిత్రం ఇటీవల లండన్‌లో అంగరంగ వైభవంగా జరిగిన బ్రిటిష్‌ అకాడమి ఆఫ్‌ ఫిల్మ్‌ అ్‌ండ టెలివిజన్‌ పురస్కారాల ప్రధానోత్సవంలో ’1917’ మూవీకి ’బెస్ట్‌ ఫిల్మ్‌’, ’అవుట్‌ స్టాండింగ్‌ బ్రిటిష్‌ ఫిల్మ్‌’, ’డైరెక్టర్‌’, ’సినిమాటోగ్రఫీ’, ’ప్రొడక్షన్‌ డిజైనింగ్‌’, ’సౌ్‌ండ, ’స్పెషల్‌ విజువల్‌ ఎఫెకట్స్‌’.. కేటగిరీల్లో అవార్డులు లభించాయి. ఇక 92వ ఆస్కార్‌ అవార్డ్‌ వేడుకలో ’పారాసైట్‌’ చిత్రంతో పాటు ’జోకర్‌’, ’1917’ చిత్రాలు కూడా తమ హవాను చూపాయి. ’జోకర్‌’ చిత్రానికి గాను హీరో జోక్విన్‌ ఫినిక్స్‌ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు.
‘టాయ్‌ స్టోరీ’కి గౌరవం..
డిస్నీ/ఫిక్చర్‌ నుంచి వచ్చిన టాయ్‌ స్టోరీ-4 యానిమేటెడ్‌ మూవీ బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ అవార్డును సొంతం చేసుకుంది. ఆస్కార్‌ అవార్డును అందుకున్న జోష్‌ కూలే మాట్లాడుతూ.. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. టాయ్‌ స్టోరీ ఇది నాలుగో ఫిల్మ్‌ అన్నారు. ఈ మూవీలోని పాత్రలు ఎంతో అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులను మెప్పించాయి. ఇదొక భయపడే వ్యక్తి గురించి స్టోరీ’ అని కూలే తెలిపారు. యానిమేషన్‌ ఫిల్మ్‌ అవార్డుల రేసులో ఈ ఏడాదిలో టాయ్‌ స్టోరీ-4 నిలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. 2002లో తొలి ఆస్కార్‌ అవార్డు అందుకున్న ఈ మూవీ ఫ్రాంచైజీ.. యానిమేటె్‌డ ఫీచర్‌ కేటగిరీలో తొలిసారి రెండు అకాడమీ అవార్డులను సొంతం చేసుకుంది. 2011లో టాయ్‌ స్టోరీ 3 మూవీకి కూడా యానిమేటె్‌డ ఫిల్మ్‌ కేటగిరీలో అవార్డు గెలుచుకుంది. ఫిల్మ్‌ డైరెక్టర్‌ జోష్‌ కూలేకు ఈ అవార్డులన్నీ దక్కాయి. గతంలో ఫిక్చర్‌ ఇన్‌ స్్ైడ ఔట్‌ స్క్రీన్‌ ప్లే కేటగిరీలో ఎంపిక అయిన జోష్‌ కూలే.. టాయ్‌ స్టోరీ 4 మూవీతో బెస్ట్‌ డైరెక్టర్‌ లిస్టులో చేరారు. ఇక నిర్మాత మార్క్‌ నెల్సన్‌ తొలిసారి నామినేషన్‌ లో నిలిచారు. జోనాస్‌ రివేరా గతంలో ప్రొడ్యుసింగ్‌ ఇన్‌ స్్ైడ ఔట్‌ మూవీకి ఆస్కార్‌ అవార్డు గెలుచుకున్నారు. ఈ ఏడాదిలో యానిమేషన్‌ ఫిల్మ్‌ అవార్డులకు నామినేట్‌ అయిన ఇతర మూవీల్లో డ్రీయావరక్క్‌ యానిమేషన్‌ మూవీ ‘హౌ టూ ట్రైన్‌ యువర్‌ డ్రాగన్‌”, ‘ది హిడన్‌ వరల్డ్‌, ‘లైకా మిస్సింగ్‌ లింక్‌” ఉన్నాయి.
లారా డెర్న్‌ ఉత్తమ సహాయ నటీ..
ఈ అవార్డుల్లో ఉత్తమ సహాయ నటిగా.. లారా డెర్న్‌ అవార్డు దక్కించుకున్నారు. ‘మ్యారేజ్‌ స్టోరీ’ సినిమాలో ఆమె నటనకు గాను ఇప్పుడు ఆమెను అవార్డు వరించింది. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల్లో కూడా ఆమె ఉత్తమ సహాయ నటి అవార్డు దక్కించుకోగా.. ఇప్పుడు ఆస్కార్‌ ఆమెను వరించింది. ఇప్పటివరకు లారా డెర్న్‌ మూడు సార్లు ఆస్కార్‌ కు నామినేట్‌ అవగా.. ఫస్ట్‌ టైమ్‌ ఆమెను అవార్డు వరించింది. ఆమె గతంలో 2015 లో ‘వైల్డ్‌ మరియు 1992 లో ‘రాంబ్లింగ్‌ రోజ్‌” సినిమాలకు ఆమె నామినేట్‌ చేయబడింది. డెర్న్‌ ఈ అవార్డు సీజన్లో ఆధిపత్యం చెలాయించింది, గోల్డెన్‌ గ్లోబ్స్‌ మరియు బాఫ్టాతో సహా ప్రధాన అవార్డు షోలలో సహాయ నటి అవార్డులను ఆమె గెలుచుకున్నారు.

ఉత్తమ చిత్రం : పారాసైట్‌
ఉత్తమ నటుడు : జోక్విన్‌ ఫీనిక్స్‌(జోకర్‌)
ఉత్తమ నటి : రెంజి జెల్వెగర్‌ (జూడి) ఉత్తమ సహాయ నటుడు : బ్రాడ్‌పిట్‌ ( వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌)
ఉత్తమ సహాయక నటి : లారా డెర్న్‌ (మ్యారేజ్‌ స్టోరీ)
ఉత్తమ దర్శకుడు : బాంగ్‌ జోన్‌-హో(పారసైట్‌)ఉత్తమ సంగీతం : జోకర్‌ (హిల్దార్‌)
బెస్ట్‌ మ్యూజిక్‌ ఒరిజనల్‌ సాంగ్‌ : ఐయామ్‌ గోన్నా.. లవ్‌ మీ ఎగేన్‌ (రాకెట్‌ మ్యాన్‌)
ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ : పారాసైట్‌
మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌ : బాంబ్‌ షెల్‌
ఉత్తమ డాక్యుమెంటర్‌ షార్ట్‌ ఫీచర్‌ : అమెరికర్‌ ఫ్యాక్టరీ
బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే : టైకా వైటిటి( జోగో ర్యాబిట్‌)
బెస్ట్‌ యానిమేటేడ్‌ ఫీచర్‌: టాయ్‌ స్టోరీ 4
బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌ : అమెరికన్‌ ఫ్యాక్టరీ
బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌: ది నైబర్స్‌ విండో
ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే : బాంగ్‌ జూన్‌ హో( పారాసైట్‌)
బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ : లెర్నింగ్‌ టూ స్కేట్‌బోర్డ్‌ ఇన్‌ ఏ వార్‌ జోన్‌ ( ఇఫ్‌ యుఆర్‌ ఏ గర్ల్‌)
బెస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్‌ : హెయిర్‌ లవ్‌
బెస్ట్‌ ఫిల్మ్‌ ఎడిటింగ్‌ : ఫోర్డ్‌ వి ఫెరారీ
బెస్ట్‌ సౌండ్‌ మిక్సింగ్‌ : 1917
ఉత్తమ సినిమాటోగ్రఫీ : 1917
ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్‌ : 1917
బెస్ట్‌ సౌండ్‌ ఎడిటింగ్‌ : ఫోర్డ్‌ వి ఫెరారీ
ఉత్తమ ప్రొడెక్షన్‌ డిజైన్‌ : వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌
బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ : ది నైబర్స్‌ విండో

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments