విండీస్ బౌలర్ల ధాటికి బ్యాట్లెత్తెసిన పాక్
ఆడుతూ.. పాడుతూ విజయం సాధించిన కరేబియన్స్
మూడు గంటల్లోనే మ్యాచ్ ముగింపు
ఐసిసి వన్డే వరల్డ్ కప్
నాటింగ్‌హామ్: గురువారం నుంచి ప్రారంభమైన ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో మొదటి మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై ఇంగ్లాండ్ ఏకపక్షంగా విజయం సాధించగా.. శుక్రవారం మరో ఏకపక్ష మ్యాచ్ విండీస్ గెలుపొందింది. పాకిస్థాన్, వెస్టిండీస్ పోరు సైతం చప్పగానే సాగింది. పాక్ నిర్దేశించిన 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విండీస్ 13.4 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి సునాయాసంగా ఛేదించింది. ఛేదనలో క్రిస్‌గేల్ (50; 34 బంతుల్లో 6స4 3స6) అద్భుత అర్ధశతకంతో చెలరేగాడు. వెన్నునొప్పి వేధిస్తున్నా భారీ సిక్సర్లు బాదేశాడు. అతడికి తోడుగా నికోలస్ పూరన్ (34నాటౌట్; 19 బంతుల్లో 4స4, 2స6) కళ్లు చెదిరే బౌండరీలతో అలరించాడు. అంతకు ముందు పాక్‌ను ఒషాన్ థామస్ (4/27), జాసన్ హోల్డర్ (3/42), ఆండ్రీ రసెల్ (4/2) భారీ దెబ్బకొట్టారు.
పాక్ విలవిల
RELATED ARTICLES