ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో ఆయన కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని గిలానీకుమారుడు కాశిం గిలానీ శనివారంనాడు ఓ ట్వీట్లో ధ్రువీకరించారు. తన తండ్రికి కరోనా బారిన పడటానికి పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్, నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఎబి) బాధ్యులని కూడా ఆయన తప్పుపట్టారు. ‘ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం, జాతీయ జవాబుదారీ బ్యూరోకు థాంక్స్. మీరు విజయవంతంగా మా తండ్రిని ప్రమాదంలోకి నెట్టేశారు’ అంటూ కాశిం గిలానీ ట్వీట్ చేశారు. యూసుఫ్ రజా గిలానీ తనపై వచ్చిన ఆరోపణల కేసులో గత గురువారంనాడు రావల్పిండిలో జరిగిన ఎన్ఎబిబీ విచారణకు హాజరయ్యారు. పిఎంఎల్-ఎన్ సుప్రీం నేత నవాజ్ షరీఫ్, పిపిపి కో-చైర్పర్సన్ అసిఫ్ అలీ జర్దారీలు కేవలం 15 శాతం ధర చెల్లించి తోషఖానా నుంచి లగ్జరీ కార్లు పొందారని, ఇందుకు గిలానీ సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఆయన ఎన్ఎబి విచారణను ఎదుర్కొంటున్నారు. పలువురు ఎంపిలు కొవిడ్ బారిన పడినందున కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి శాశ్వతంగా మినహాయింపు ఇవ్వాలని గిలానీ కోర్టును కోరారు.
పాక్ మాజీ ప్రధాని గిలానీకి కరోనా పాజిటివ్
RELATED ARTICLES