పొర్ట్ ఎలిజాబెత్: సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో పాకిస్థాన్ 5 వికెట్లతో ఘన విజయం సాధించింది. శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన సఫారీ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు హాషిం ఆమ్లా, హెండ్రిక్స్ శుభారంభాన్ని అందిస్తూ తొలి వికెట్‌కు 82 పరుగులు జోడించారు. తర్వాత హెండ్రిక్స్ (67 బంతుల్లో 5 ఫోర్లతో 45) పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం తన తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడేందుకు వాన్ డర్ డుసెన్ క్రీజులో వచ్చాడు. ఇతను ఆమ్లాతో కలిసి చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. రెండో వికెట్‌కు 155 పరుగుల కీలకమైన భాగస్వామ్యాన్ని ఏర్పిరిచాడు. చివర్లో వాన్ డర్ దూకుడుగా ఆడుతూ బౌండరీల వర్షం కురిపించాడు. వేగంగా ఆడే క్రమంలో వాన్ డర్ డుసెన్ (93; 101 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హసన్ అలీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మరోవైపు సీనియర్ బ్యాట్స్‌మన్ ఆమ్లా వేగంగా ఆడడంలో విఫలమయ్యాడు. పాక్ బౌలర్లపై విరుచుకుపడకుండా ఆత్మ రక్షణలో ఆడడంతో స్కోరుబోర్డు నత్త నడకన సాగింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సమయానికి సౌతాఫ్రికా 266/2 పరుగులు చేసింది. ఆఖర్లో డేవిడ్ మిల్లర్ 12 బంతుల్లో 16 పరుగులు చేయగా.. హాషిమ్ ఆమ్లా (108 నాటౌట్; 120 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలిచారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పాకిస్థాన్ జట్టులో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ 101 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) శుభారంభాన్ని ఇచ్చాడు. తర్వాత బాబర్ ఆజమ్ (49), సీనియర్ బ్యాట్స్‌మన్ మహ్మద్ హఫీజ్ (71 నాటౌట్; 63 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి ఆడడంతో పాకిస్థాన్ మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే 267/5 స్కోరు చేసి 5 వికెట్లతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాక్ 1 ఆధిక్యం సాధించింది.
ఆమ్లాపై విమర్శలు..
పాక్‌తో జరిగిన తొలి వన్డేలో సెంచరీ సాధించి నాటౌట్‌గా నిలిచిన సౌతాఫ్రికా ఓపెనర్ హాషిం ఆమ్లాపై ఆదేశ మాజీలు, సీనియర్లు మండిపడుతున్నారు. ఎందుకంటే తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జ ట్టు నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లు కో ల్పోయి 266 పరుగులు మాత్రమే చేయగలిగింది. చేతిలో వికెట్లు ఉన్న సీనియర్ బ్యాట్స్‌మన్ ఆమ్లా మాత్రం కుదురుగా ఆ డాడు. అతను వేగంగా ఆడి ఉంటే సౌతాఫ్రికా జట్టు 300 పరుగులైన సాధించేది. ఆమ్లా ఆరంభం నుంచి చివరి వరకు అజేయంగా క్రీజులో ఉన్నా ప్రయోజనం లే కుండా పోయింది. ధాటిగా ఆడి పాక్ ము ందు భారీ టార్గెట్ ఉంచితే మ్యాచ్ ఫలితం వేరేగా ఉండేదని అంటున్నారు. ఆమ్లా సెం చరీ కోసమే స్లోగా ఆడాడని తీవ్ర స్థాయి లో విమర్శలను ఎదుర్కొంటున్నాడు.
కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన ఆమ్లా..
స్లోగా ఆడి సౌతాఫ్రికా ఓటమికి కారణమైయ్యాడంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న హాషిం ఆమ్లా ఈ మ్యాచ్‌లో అరుదైన రికార్డును సాధించాడు. భారత పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. తాజా మ్యాచ్‌లో (108) పరుగులు చేసిన ఆమ్లా వన్డేల్లో 27వ శతకాన్ని నమోదు చేశాడు. అయితే కోహ్లీ కంటే వేగంగా ఈ ఫీట్‌ను అందుకున్న బ్యాట్స్‌మన్‌గా ఆమ్లా రికార్డుల్లో నిలిచాడు. కోహ్లీ 169 ఇన్నింగ్స్‌లలో 27 శతకాలు చేస్తే.. ఆమ్లా 167 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఫీట్‌ను అందుకున్నాడు. దీంతో వన్డేల్లో వేగంగా 27 శతకాలు చేసిన బ్యాట్స్‌మన్‌గా ఆమ్లా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ ఈ ఫీట్‌ను అందుకోవడానికి 254 ఇన్నింగ్స్‌లు అవరమయ్యాయి.
పాక్ చేతిలో సౌతాఫ్రికా ఓటమి
RELATED ARTICLES