చివరి టి20లో విండీస్ మహిళల ఓటమి
కరాచీ: వెస్టిండీస్, పాకిస్థాన్ మహిళా జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్ టి20 సిరీస్‌ను వెస్టిండీస్ జట్టు 2-1తో సొంతం చేసుకుంది. తొలి రెండు మ్యాచుల్లో విజయం సాధించిన విండీస్ అమ్మాయిలు ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో మాత్రం తడబడ్డారు. దీంతో ఈ మ్యాచ్‌ను పాకిస్థాన్ అమ్మాయిలు 12 పరుగులతో దక్కించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగుల భారీ స్కోరు చేసింది. పాక్ జట్టులో నిద దార్ (53; 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఉమైమ సొహైల్ (28), ఆలియ రియాజ్ (24 నాటౌట్) పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన కరీబియన్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులే చేయగలిగింది. విండీస్ జట్టులో ఓపెనర్ డాటిన్ (46; 29 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా ఆడినా మిగతా బ్యాట్స్‌వుమెన్స్ ఘోరంగా విఫలమయ్యారు. పాక్ బౌలర్లలో అనమ్ అమిన్ మూడు వికెట్లు తీయగా.. సనా మీర్ రెండు వికెట్లు పడగొట్టింది. మ్యాచ్‌లో అర్ధ శతకంతో రాణించిన నిద దార్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్ అమాంతం రాణించిన డాటిన్ (వెస్టిండీస్), నిద దాస్(పాకిస్థాన్)లకు సంయుక్తంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు సొంతం చేసుకున్నారు.
పాక్‌కు ఓదార్పు విజయం
RELATED ARTICLES