చెలరేగిన ఒలివర్
3 టెస్టు సిరీస్ సౌతాఫ్రికా వశం
జొహెన్నెస్‌బర్గ్: పాకిస్థాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను సౌతాఫ్రికా 3 క్లీన్ స్వీప్ చేసింది. సఫారీ జట్టు ఆల్‌రౌండ్ షోతో సిరీస్‌ను సునాయాసంగా సొంతం చేసుకుంది. చివరి టెస్టులో పాకిస్థాన్ 107 పరుగులతో ఓటమిపాలైంది. అంతకుముందు తొలి టెస్టును 6 వికెట్లతో, రెండో టెస్టును 9 వికెట్లతో సౌతాఫ్రికా గెలుచుకుంది. తాజాగా ఆఖరి టెస్టులోనూ సఫారీ జట్టు అద్భుతంగా పోరాడి విజయం సాధించింది. సిరీస్‌లో చెలరేగిన సౌతాఫ్రికా బౌలర్ ఒలివర్ మొత్తం 24 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును సొంతం చేసుకున్నాడు. సోమవారం 153/3 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. దూకుడుగా ఆడుతున్న ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్ (21) పరుగులు ఒలివర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో పాక్ 162 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. తర్వాత కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న మరో ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ అసద్ షఫీక్ (65; 71 బంతుల్లో 11 ఫోర్లు)ను ఫిలిండర్ తెలివైన బంతితో ఔట్ చేశాడు. దీంతో పాక్ ఓటమి దాదాపు ఖారారైపోయింది. చివర్లో ఫహీమ్ (15), హసన్ అలీ (22)లతో కలిసి షదాబ్ ఖాన్ పాక్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ సౌతాఫ్రికా బౌలర్లు వరుసక్రమాల్లో వికెట్లు తీస్తూ పాక్‌ను హడలెత్తించారు. చివరికి పాకిస్థాన్ 65.4 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైపోయింది. దీంతో సఫారీ జట్టుకు భారీ విజయం దక్కింది. చివరి వరకు అజేయంగా నిలిచిన షదాబ్ ఖాన్ 66 బంతుల్లో 7 ఫోర్లతో 47 పరుగులు చేశాడు. సఫారీ బౌలర్లలో ఒలివర్, రబాడ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. స్టెయిన్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన డికాక్ (129)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
సంక్షిప్త స్కోర్లు:
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 262 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 303 ఆలౌట్.
పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ 185 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 273 ఆలౌట్.
పాకిస్థాన్ వైట్‌వాష్
RELATED ARTICLES