తొలి టి20లో విండీస్ ఘన విజయం
మహిళల టి20 సిరీస్
కరాచీ: పాకిస్థాన్, వెస్టిండీస్ మహిళల జట్ల మధ్య ప్రారంభమైన టి 20 సిరీస్‌లో వెస్టిండీస్ బోణి చేసింది. ఇక్కడ జరిగిన తొలి మ్యా చ్‌లో ఆతిథ్య పాకిస్థాన్‌ను విండీస్ 71 పరుగులతో చిత్తు చేసింది. తొలుత బ్యా టింగ్ చేసిన వె స్టిండీస్ మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 160 పరుగులు చే సింది. కరీబియన్ జట్టులో కైసియా నైట్ (8), కాంప్‌బెల్ (4) పరుగులు మాత్రమే చే సి ఆవుటైనా అనంతరం ఓపెనర్ డాటిన్, న తాషా అద్భుతమైన బ్యాటింగ్‌తో విండీస్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి ప రుగుల వరద పారించారు. ఒకవైపు నటషా కుదురుగా ఆడుతుం టే.. మరోవైపు డాటిన్ మాత్రం చెలరేగి ఆడింది. పాక్ బౌలర్లపై విరుచుకుపడి బౌండరీల వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే వీరు మూడో వికెట్ కు అజేయంగా 100 పరుగుల భాగస్వామ్యాన్ని కూడా ఏర్పర్చుకొన్నారు. చివరి వరకు అజేయంగా ఉండి విండీస్‌కు భారీ స్కోరును అందించారు. విధ్వంసకర ఇ న్నింగ్స్ ఆడిన డాటిన్ (90 నాటౌట్; 60 బ ంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులు చేసింది. మరోవైపు నటషా నేషన్ (50 నా టౌట్; 35 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగి ఆ డింది. అనంతరం భారీ లక్ష్యం తో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌పై విండీస్ బౌలర్లు ఎదురుదాడికి దిగారు. పరుగులు చేయకుండా కట్టడి చేస్తూనే వరుస విరామాల్లో కీలక వికెట్లు పడగొడ్తూ పాక్‌ను హడలెత్తించారు. వీరి ధాటికి పాక్ వరుసక్రమా ల్లో వికెట్లను చేజార్చుకుంది. పాక్ సారథి బిస్మా మారూఫ్ (38; 37 బంతుల్లో 5 ఫోర్లు), జవేరియా ఖాన్ (19) ఇద్దరూ దూ కుడుగా ఆడిన ఫలితం లేకుండాపోయింది. తర్వత మరింతగా రెచ్చిపోయిన కరీబియన్ బౌలర్లు పాక్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. పాక్ జట్టులో 8 బ్యాట్స్‌వుమెన్స్‌లు రెండంకెల స్కోరుమార్కూను సైతం దాటలేక పోయారు. దీంతో పాకిస్థాన్ 18 ఓవర్లలో 89 పరుగులకే ఆలౌటైపోయింది. కరీబియన్ బౌలర్లలో స్కోనెల్ మూడు వికెట్లు పడగొట్టగా.. సెల్మాన్, మహ్మద్ చెరో రెండు వికెట్లు తీశారు. బ్యాట్‌తో మెరిసిన డాటిన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో వెస్టిండీస్ 1 ఆధిక్యం సాధించింది.
పాకిస్థాన్ చిత్తు..
RELATED ARTICLES