కాబూల్ వీధుల్లో కదం తొక్కిన మహిళలు
గాలిలోకి తాలిబన్‌ల కాల్పులు
పెషావర్/కాబూల్ : గాలిలోకి తాలిబన్లు జరిపిన కాల్పులను కూడా లెక్కచేయకుండా మంగళవారం నాడు మహిళలు కాబూల్ వీధు ల్లో కదం తొక్కారు. ఆఫ్ఘనిస్థాన్‌లో పాకిస్థాన్ జోక్యాన్ని నిరసిస్తూ, ‘పాకిస్థాన్… చావేగతి’ అంటూ వందలాదిమంది ప్రదర్శకులు నినాదాలు చేశారు. పాకిస్థాన్ జెట్ విమానాలు పెషావర్ రాష్ట్రంలో గగనతల దాడులు జరిపాయని వారు విమర్శించారు. విదేశీ జోక్యాన్ని సహించబోమంటూ ఈ దాడులను ప్రతిఘటిస్తూ నినాదాలు చేశారు. దీంతో పాక్ వ్యతిరేక నినాదాలతో కాబూల్ హోరెత్తింది. సోమవారంనాడు తాలిబన్లు పంజ్‌షీర్‌ను స్వాధీనం చేసుకున్నామని ప్రకటించుకున్నారు. తమ అధీనంలోనే ఆ ప్రాంతం ఉందని పేర్కొన్న నేపధ్యంలో పాక్ జోక్యాన్ని నిరసిస్తూ, పాక్ దౌత్యకార్యాలయం వద్ద పెద్ద ఎత్తున గుమిగూడిన నిరసన వ్యక్తం చేస్తున్న మహిళా ప్రదర్శకులను చెల్లాచెదురు చేసేందుకు హెచ్చరికగా గాలిలోకి తాలిబన్లు కాల్పులు జరిపారని ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ‘ఖమ్మ’ న్యూస్ ఏజన్సీ పే ర్కొంది. వాటిని ప్రదర్శకులు లెక్కచేయలేదు. పెద్ద సంఖ్యలో మహిళలు, వారి వెంట పురుషులు వీధుల్లో నినాదాలుచేస్తూ కదం తొక్కా రు. తమ దేశ వ్యవహారాల్లో పాకిస్థాన్ జోక్యం చేసుకుంటోందని ప్రదర్శకులు నిరసన తెలియజేశారు. సుమారు 70 మంది శక్తిమంతమైన ప్రదర్శకులు, వీరిలో ఎక్కువమంది మహిళలు పాల్గొన్నారు. కాబూల్‌లోని పాకిస్థాన్ దౌత్యకార్యాలయం ఎదుట ప్రదర్శకులు గుమిగూడి, ‘దేశం విడిచి వెళ్ళిపోండి’ అంటూ నినాదాలు చేశారు. పాకిస్థాన్‌కు చావే గతి, స్వేచ్ఛ కావాలి, పాక్ చేతిలోని కీలుబొమ్మ ప్రబుత్వం మాకు వద్దు, విశాల భాగస్వామ్యంతో కూడి ప్రభుత్వం కావాలి, అల్లాహో అక్బర్ అంటూ ప్రదర్శకులు నినాదాలు చేశారు. ప్రదర్శకులు చేసిన నినాదాలను, ఈ ప్రదర్శన వీడియోలను ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన అతిపెద్ద మీడియా కంపెనీ ‘మోబై గ్రూప్’కు చెందిన ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సాద్ మొహ్‌సెని ట్విట్టర్‌లో పెట్టారు. కాబూల్‌లో జరిపిన పాకిస్థాన్ వ్యతిరేక ప్రదర్శనలను దీంతో ఎంతోమంది వీక్షించారు.
ఖైదీలుగా బతకడం మాకు ఇష్టం లేదు అంటూ కూడా వారు నినాదాలు చేశారు. ప్రదర్శన అనంతరం, పంజ్‌షీర్ రాష్ట్రంలో తిరుబాటు ఉప నాయకుడు అహ్మద్ మసూద్ ఒక వీడియో విడుదల చేశారు. తాలిబన్లకు వ్యతిరేకంగా ఆఫ్ఘన్ ప్రజలు పునరుజ్జీవనంతో తిరుగుబాటు చేస్తున్నారని వాయిస్ వీడియోలో పేర్కొన్నారు. బ్లాఖ్, దైకుంది రాష్ట్రాల్లో కూడా ప్రజలు సోమవారంనాడు రాత్రి వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు జరిపారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా పంజ్‌షీర్‌లో పాక్ జరిపిన వైమానిక దాడులను ఇరాన్ ఖండించింది. ఆఫ్ఘనిస్థాన్‌లో విదేశీ జెట్ విమానాలు దాడులు చేయడాన్ని ఇరాన్ విదేశాంగ మంత్రి ఖండిస్తూ దీనిపై దర్యాప్తు జరపాలని కోరారు. కాగా పాకిస్థాన్‌కు చెందిన ఇంటిలిజెన్స్ చీఫ్ (ఐఎస్‌ఐ) లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ మంగళవారంనాడు కాబూల్‌లో అప్రకటిత పర్యటన జరిపారు. తాలిబన్ల కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఆయన చర్చలు జరిపారని వార్తలు తెలిపాయి. ఈ పర్యటన సందర్భంగా ఆయన తాలిబన్ల నేత ముల్లా అబ్దుల్ ఘని బరదార్‌ను కలిశారు.
పాకిస్థాన్ ‘గో బ్యాక్’
RELATED ARTICLES